సమాధానం నెం.122 - ప్రశ్న నెం.122 (28-12-2021) విషయం "ఈ యోగం యొక్క గొప్పతనం, 7 ప్రశ్నలు - 5వ ప్రశ్న".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.122 - ప్రశ్న నెం.122 (28-12-2021) విషయం "ఈ యోగం యొక్క గొప్పతనం, 7 ప్రశ్నలు - 5వ ప్రశ్న".

Post by Katakam »

1) 7 ప్రశ్నల లోని 4వ ప్రశ్నకు, "భౌతిక రంగానికీ, ఆధ్యాత్మిక రంగానికీ మధ్య ఉన్న తేడాను మీరు తెలుసుకోవాలి" అనే 5వ ప్రశ్నకు సంబంధం ఏమిటి?

2) ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, ఒక ప్రశ్న దాని ముందరి ప్రశ్నకు సమాధానం కావడం అనే వరవడి ఇక్కడ కూడ చూడనవుతుంది. అంటే "భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎలా మెలగాలో మీరు నిశ్చయించుకోవాలి" అనే 4వ ప్రశ్నకు పైన ఉదహరించిన 5వ ప్రశ్న సమాధానం అని.

3) భౌతిక మార్గం అంటే జీవనం గడపడం లేదా జీవించి ఉండడానికి భౌతిక కార్యకలాపాలకు పరిమితం కావడం అనీ, ఆధ్యాత్మిక మార్గం అంటే జీవనం గడపడంలో జీవిత విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం అనీ చెప్పుకున్న మీదట, భౌతిక మార్గంలో మరియు ఆధ్యాత్మిక మార్గంలో మెలగడం లేదా చరించడం అనే దానిని ఎలా నిశ్చయించుకోవాలి అనే ప్రశ్నకు భౌతిక రంగానికీ, ఆధ్యాత్మిక రంగానికీ మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం అనేదే సమాధానం - ఇదే తెలియవలసిన, తెలుసుకోబడబోతున్న విషయం.

4) 5వ ప్రశ్నకు వివరణ ఏమిటి?

5) ప్రస్తుత సృష్టి విధానంలో, జీవనం గడపడానికి లేదా జీవించి ఉండడం అనే దానికి పరిమితమైన మనిషికి, సమస్తమూ జీవన సంబంధమే, ఆధ్యాత్మికత, మోక్షం, లక్ష్యం, వగైరాలుగా పేర్కొనబడి దేముళ్ళకు సంబంధింప చేయబడిన జీవన విధానంతో సహా. అంటే దేముళ్ళు అంటే ఏమిటి అనే లోతులు తెలుసుకోవడం కాక, ఆ దేముళ్ళను, దేముళ్ళు అనే అంశాన్ని కూడ జీవన అవసరాలకు ఉపయోగపడేలా చేసుకోవడం సమస్తమూ స్థూల సంబంధమే.

6) అలాంటి ప్రస్తుత పరిస్థితిలో మనిషిగా ఎందుకు ఉండడం జరుగుతోంది, మనిషిగా ఎందుకు జన్మించడం జరుగుతోంది, లక్ష్యం ఏమిటి, వగైరా ప్రశ్నల జోలికి వెళ్ళడం సామాన్య మానవునికి అసంభవానికి ఏమాత్రం తగ్గని పరిస్థితియే. అలా వెళ్ళిన మహానుభావులకు కూడ అసలు లోతులు అందని, అర్థం కాని పరిస్థితియే. అందులో భాగంగా భౌతిక మార్గం, ఆధ్యాత్మిక మార్గం అనే వాటికి సంబంధించిన విచక్షణ, వివేకం రావడం కూడ అంతే అసంభవం. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితికి ఒక ఆరంభం కలగడమే భౌతిక రంగానికీ, ఆధ్యాత్మిక రంగానికీ మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం.

7) అలా తెలుసుకోవడం ఎలా సాధ్యపడుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే దైనందిన జీవితంలో భౌతిక రంగం, ఆధ్యాత్మిక రంగం రెండూ కలిసి ఉన్న పరిస్థితి నుంచి వాటిని విడివిడిగా విడదీసి చూడగలగడం. అందుకు సాధనం ఈ యోగా ప్రాక్టీసు చేసుకోవడానికి లేదా ఈ యోగంలో చేరి యోగ క్రియలకు, ప్రక్రియలకు శరీరంలో జరిగే అవకాశం ఇవ్వడానికి అర్హత కలిగిన దృష్ట్యా, ఆ యోగా ప్రాక్టీసు వలన జరిగే నిశితమైన మార్పులను, చేర్పులను పరిశీలించగలిగిన గమనికయే, కేవలం యోగా ప్రాక్టీసు వలన మాత్రమే జనియించి డెవలప్ అవుతూ పోయే గమనికయే.

8) ఈ యోగ లక్ష్య సిద్ధిలో ఈ 5వ ప్రశ్న యొక్క ప్రాధాన్యత ఏమిటి?

9) మానవ జీవన సమరంలో విడదీయ రానంతగా కలిసిపోయిన లేదా మేథో ప్రభావంతో మమేకం చేయబడిన భౌతిక ఆధ్యాత్మిక రంగాల గురించి తెలుసుకోవడం అనేది మానవ జీవనంలో లేదా దైనందిన జీవనంలో భాగంగా ఉన్న దృష్ట్యా మరియు వాటిని గమనించడానికి ఎక్కడికో పోవలసిన అవసరం లేని కారణంగా అది అంత కష్టమైన కార్యం కాని దృష్ట్యా, తన గురించి, తన నేను గురించి పట్టించుకోగలగడం సాధ్యం కావడానికి ఒక రకంగా తొలి ఆరంభం కావడమే ఈ యోగ లక్ష్య సిద్ధిలో ఈ 5వ ప్రశ్న యొక్క ప్రాధాన్యత.
Post Reply