సమాధానం నెం.132 - ప్రశ్న నెం.132 (17-1-2022) విషయం "సూక్ష్మ దేహ వ్యవస్థ".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3868
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.132 - ప్రశ్న నెం.132 (17-1-2022) విషయం "సూక్ష్మ దేహ వ్యవస్థ".

Post by Katakam »

1) సూక్ష్మ దేహ వ్యవస్థ అంటే ఏమిటి?

2) ఆ మాటలో ఇమిడి ఉన్న భావసూచనను ఆధారం చేసుకుని వస్తుతః చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే స్థూల దేహం లోనే ఉన్న మరియు పనిచేస్తున్న వ్యవస్థయే సూక్ష్మ దేహ వ్యవస్థ. సూక్ష్మం అంటే ఏమిటి అంటే స్థూలం కానిది, స్థూలంగా కనుపించనిది, స్థూల బాహ్య మరియు ఆంతరిక శరీర భాగాలలో సూక్ష్మంగా పనిచేసేది. యోగ పరంగా చెప్పుకోవాలి అంటే ఫిజికలు లెవెలు/ తలం స్థూలం అయితే, యాస్ట్రలు, మెంటలు తలాలు, వాటికి అదనంగా మానవ రూప నిర్మాణం అనంతరం బుద్ధి క్రియాశీలం కావలసిన అవసరానికి ముందుగా అసమానంగా పరిఢవిల్లిన మేథస్సు లేదా తెలివితేటలు - వీటి మొత్తం సూక్ష్మ దేహం లేదా సూక్ష్మం అని పిలువబడనవుతుంది. దానినే సందర్భాన్ని బట్టి యాస్ట్రలు అని కూడ పిలవడం జరుగుతుంటుంది.

3) ఇంతకీ సూక్ష్మం అంటే ఏమిటి అనేది అక్షరాల మూల స్థాయిల నుంచి కూడ చెప్పుకోవలసిన అవసరం. సూక్ష్మ ఉనికి కలిగి ఉండి తెలియబడనిది, అంటే స్థూలానికి తెలియబడనిది, స్థూలం చేత తెలియబడనిది. ఎందుకు అంటే స్థూలం సూక్ష్మం యొక్క అదుపు లోనే ఉంది గనుక, స్థూలానికి సూక్ష్మం కంటె అతీతమైన మూలంతో అనుబంధం ఏర్పడితే తప్ప, స్థూలం చేత సూక్ష్మం గుర్తించబడనవదు గనుక.

4) సూక్ష్మ దేహ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

5) ప్రస్తుత సృష్టి విధానంలో -అంటే సృష్టి లక్ష్య ప్రథమాంకం అయిన సృష్టి భ్రష్టు పట్టిపోవడం లేదా దిగజారిపోవడం అనే దానిలో- పూర్తి స్థాయి ప్రధాన పాత్ర సూక్ష్మానిదే. సృష్టి స్థాయి ప్రక్రియగా వ్యక్తి స్థాయిలలో జరుగుతున్నది అదే. వ్యక్తి స్థాయిలు పతనావస్థకు రావడం లేదా పూర్తిగా దిగజారిపోవడం అనేది సృష్టి స్థాయి ప్రక్రియకు అనుగుణంగా మాత్రమే. తానుగా స్వతంత్రించి (ఖచ్చితంగా చెప్పాలి అంటే అలా స్వతంత్రించేలా చేయబడి) మనిషిలో ఉన్న అసలు నేను స్థానంలో నకిలీ నేనుగా చెలామణి అవుతోంది సూక్ష్మమే. సామాజిక, ఆధ్యాత్మిక మనిషి యాథాలాపంగా నేను అని చెప్పుకునే సదరు స్థాయి సూక్ష్మానిదే.

6) సూక్ష్మ దేహ వ్యవస్థకు, ఆత్మిక తలాలకు మధ్య ఉన్న తేడా ఏమిటి?

7) మానవ దేహ వ్యవస్థ లోని ఏడు తలాలలో క్రింది మూడు అథో స్థాయిలకు సంబంధించింది సూక్ష్మం. పై మూడు ఉన్నత స్థాయిలకు సంబంధించినవి ఆత్మిక తలాలు. యోగా ప్రాక్టీసు చేసే దృష్ట్యా డెవలప్ అయ్యే గమనికతో సూక్ష్మ దేహం యొక్క చర్యలను/ క్రియలను కేవలం గుర్తించగలిగే అవకాశం. అత్యంత విశేషంగా డెవలప్ అయిన గమనికకు సైతం ఆత్మిక తలాలను, వాటి కార్యక్రమాలను గుర్తించడం సాధ్యం కాని పని. ఆత్మిక తలాలు వస్తుతః ఆత్మ సంబంధంగా సృష్టికి అతీతమైన స్థాయిలకు సంబంధించిన తలాలు. సూక్ష్మ స్థాయిలు, సూక్ష్మ తలాలు అనేవి ప్రస్తుత సృష్టి విధానానికి అనుగుణంగా వ్యక్తి స్థాయిలలో వ్యక్తి యొక్క ప్రారబ్ద కర్మకు కట్టుబడి జరిగే వ్యక్తి స్థాయి కార్యక్రమాలకు పట్టుగొమ్మలు.

8) సృష్టి లక్ష్యంలో సూక్ష్మ దేహ వ్యవస్థ యొక్క పాత్ర ఏమిటి?

9) క్రియాశీల పాత్రగా సృష్టి లక్ష్యంలో ప్రధాన పాత్ర సూక్ష్మ దేహ వ్యవస్థదే. మాస్టరు గారి కాలంలో జరిగిన యోగ క్రియల, యోగ ప్రక్రియల, యోగ ప్రయోగాల ఫలితంగా సూక్ష్మాలు నియంత్రించబడడం అనే సృష్టి స్థాయి కార్యక్రమం అనేది మూల/ శూన్య స్థితుల, స్థాయిల ఆధ్వర్యంలో చేపట్టబడి, తమను మించిన మరియు తమను శాసించగలిగిన స్థాయి ఉంది అనే అవగాహనతో తమ పరిమిత స్థాయి నైజాన్ని గుర్తించి, ఆ అసలైన అధికారిక స్థాయి ప్రేరణకు, జ్ఞాన పురస్సరమైన ఆదేశాలకు లోబడి సూక్ష్మాలు పని చేయగలిగినపుడు మాత్రమే.
Post Reply