1) రూప మానసికం అంటే ఏమిటి?
2) మానవ దేహ వ్యవస్థ లోని ఏడు తలాలలో ఉన్న మూడు అథో తలాలలో పై స్థాయిది అయిన మానసిక తలం లోని రెండు భాగాలలో ఒక భాగం రూప మానసికం లేదా ఆంగ్లంలో మెంటలు రూప. మనసుకు అందే ఆలోచనలు, భావనలు, తలపులు నిల్వ అయే స్థానం/ ప్రాంతం మానసిక తలం అని ఇంతకు ముందుగానే చెప్పుకోవడం జరిగింది. ఆ ఆలోచనలు, భావనలు, తలపులు మనసుకు తెలిసేలా అందేవి చాలా తక్కువ అనీ, స్థూల స్థాయి చేత గుర్తించబడేలా మనసుకు అందేవి అందులో ఇంకా తక్కువ అనీ కూడ చెప్పుకోవడం జరిగింది. స్థూల స్థాయి చేత గుర్తించబడేలా గానీ, స్థూల స్థాయి చేత గుర్తించబడకుండా కేవలం మనసుకు తెలిసేలా గానీ మనసుకు అందే ఆలోచనలు, భావనలు, తలపులు మొత్తం రూప మానసికం అవుతుంది. అంటే మనసుకు తెలియకుండా అందే నిముషానికి 70,800 తలపులు అరూప మానసికం అయితే, మనసుకు తెలుస్తూ అందే గంటకు 800 తలపులు రూప మానసికం అవుతుంది.
3) రూప మానసికం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
4) మనసుకు తెలుస్తూ అందే తలపులను గ్రహించడం మాత్రమే తప్ప, మనసుకు తెలియకుండా అందే తలపులు ఉంటాయి అని గానీ, అంతకు మించి ఆ తెలియని తలపులే అధికంగా ఉంటాయి అని గానీ తెలియని మనిషి మనసుకు తెలుస్తూ అందే తలపులను, అందులో ప్రముఖంగా స్థూల స్థాయి చేత గుర్తించబడే తలపులను ఆధారం చేసుకుని మాత్రమే తన మానసిక పరిధిని విస్తృతం చేసుకుంటున్నాడు, అదే సమస్తం అని భ్రమపడుతున్నాడు. అదే మేథో స్థాయిగా పరిఢవిల్లి, అరూప మానసికానికి, దానిని మించిన తలాల సంబంధంగా ప్రగతి చెందవలసిన అవసరాన్ని గుర్తించలేని కారణంగా, లక్షణ పరమైన మానవ అభ్యున్నతికి ఈషణ్మాత్రం కారణం కాలేకపోవడం మాత్రమే కాక, మేథో పరిఢవిల్లుడుతో సృష్టి భ్రష్టుపట్టిపోవడంలో తనదైన అమోఘమైన పాత్రను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాడు. ఇదే ప్రత్యక్షంగా, పరోక్షంగా రూప మానసికం యొక్క ప్రాముఖ్యత.
5) రూప మానసికానికి, అరూప మానసికానికి సంబంధం ఏమిటి?
6) రూప మానసికం, అరూప మానసికం రెండూ కూడ మానసిక తలంలో భాగాలే. మనసుకు తెలిసేలా అందేవి రూప మానసికం. మనసుకు తెలియకుండా అందేవి అరూప మానసికం. రూప మానసికం గురించి, అరూప మానసికం గురించి సరయిన అవగాహన ఉంటే తప్ప, విశ్వ విధానానికి లేదా ప్రస్తుత సృష్టి విధానానికి మరియు యోగ విధానానికి మధ్య ఉన్న అంతరాన్ని వస్తుతః నిగుంభనంగా స్పష్టమైన మాటలలో వెల్లడించిన ఒక అతి ముఖ్య మూల సూత్రం "యాస్ట్రలుకు మానసిక చిత్రాలను ఘనీభవింపచేసే సామర్థ్యం ఉంది, అరూప లెవెలులో అది పనిచేయదు" (మాస్టరు గారి డైరీ 6-12-1917) అనే దానికి అర్థం తెలియడం, అవగాహన కలగడం సాధ్యం కాదు.
7) సృష్టి లక్ష్యంలో రూప మానసికం యొక్క పాత్ర ఏమిటి?
8) పైన చెప్పుకున్న రూప మానసికం యొక్క ప్రాముఖ్యతనే రూప మానసికం యొక్క పాత్రగా కూడ తీసుకోనవుతుంది. ప్రత్యేకించి సృష్టి లక్ష్యానికి అన్వయించి చెప్పుకోవాలి అంటే రూప మానసికానికి తన కంటె పై స్థాయి పాత్ర -అదే అరూప మానసికం- మరియు అంతకు మించిన పై స్థాయి పాత్రలు ఉన్నాయని తెలిసి, తాను సంస్కరించబడవలసిన అవసరం సృష్టి లక్ష్య సంబంధంగా ఉంది అని తెలియడమే అవసరం. అందుకు యోగా ప్రాక్టీసు, దానిలో భాగంగా నోటి మాటలో మరియు శారీరిక చేతలో రూప మానసికం యొక్క ప్రభావాన్ని గమనించి, దాని పరిమితత్వాన్ని గ్రహించి, అది సంస్కరించబడవలసిన అవసరాన్ని గుర్తించి, అలా అని భావన చేసుకోగలిగిన గమనిక స్థాయి డెవలప్ కావడం మాత్రమే మార్గం.
సమాధానం నెం.135 - ప్రశ్న నెం.135 (23-1-2022) విషయం "రూప మానసికం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm