సమాధానం నెం.137 - ప్రశ్న నెం.137 (27-1-2022) విషయం "మేథస్సు".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.137 - ప్రశ్న నెం.137 (27-1-2022) విషయం "మేథస్సు".

Post by Katakam »

1) మేథస్సు అంటే ఏమిటి?

2) మేథస్సు అంటే మామూలుగా చెప్పుకునే అర్థంలో తెలివితేటలు అని. కానీ, అక్షర మూలాలకు వెళ్ళి చెప్పుకుంటే, తనను కాక దేనినీ కాదనుకునే, కాదనగలిగిన, అథఃకరించగలిగిన గొప్ప సూక్ష్మ ఉనికి. యోగ పరంగా చెప్పుకుంటే‌, మానవ దేహ వ్యవస్థ లోని ఏడు తలాలలో నాలుగవది అయిన బుద్ధిక్ తలం లోని క్రింది సగం, సృష్టి సంబంధంగా జరిగిన క్రమవికాసంలో మూడున్నర దశల లోని మూడు దశల తరువాత ఉన్న సగానికి ప్రతీక. బుద్ధి జీవి అయిన మనిషిలో బుద్ధి క్రియాశీలం కావడానికి ముందుగా అమోఘంగా పరిఢవిల్లి, మానవ దేహ వ్యవస్థ లోని మూడు అథో తలాలతో మాత్రమే అనుబంధం కలిగి ఉన్న ఆంతరిక సూక్ష్మ ఉనికి. ప్రస్తుతం మనిషికి సర్వస్వంగా వెలుగొందుతున్న ఏకైక సూక్ష్మ ఉనికి.

3) మేథస్సు యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

4) ప్రస్తుత సృష్టి విధానంలో ప్రాముఖ్యత మేథస్సుదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఎలాంటి ప్రాముఖ్యత అనేదే ప్రస్తుతం చెప్పుకోబడవలసిన విషయం. మనిషిలో మేథస్సు పరిఢవిల్లడానికి ముందు ఉన్న పవిత్రత, నిబద్ధత (కేంద్రానికి కట్టుబడి ఉండడం, దీనినే సామాజిక అర్థాన్ని మించిన నిజాయితీ అని చెప్పుకోనవుతుంది) మేథస్సు పరిఢవిల్లుడుతో క్రమేణా అడుగంటి పోతూ వచ్చాయి అని చెప్పడంలో కూడ ఎలాంటి సందేహం లేదు. మానవ జీవన అవసరాలను తీర్చే వసతులను, సౌకర్యాలను సమకూర్చడంలో మేథస్సు పాత్ర ఎంత గణనీయమో, లక్షణ పరంగా మనిషిని దిగజార్చడంలో మేథస్సు పాత్ర అంతకు మించి గణనీయం అని బల్లగుద్ది మరీ చెప్పనవుతుంది. ప్రస్తుత సృష్టి విధానంలో మనిషికి ఆధ్యాత్మికంగా (ఆది, ఆత్మ ఏకత లేదా ప్రాణం, స్థూలం కలయిక అనే సృష్టి లక్ష్య సంబంధంగా) ప్రగతి చెందడంలో ఏ కొంచెం కూడ దోహదపడనిది మేథస్సు యొక్క మహానత.

5) మేథస్సుకు, బుద్ధికి మధ్య సంబంధం ఏమిటి?

6) పైన చెప్పుకున్నట్లుగా, మేథస్సు బుద్ధిలో భాగమే. కాకపోతే, ప్రస్తుత సృష్టి విధానానికి అనుగుణంగా మనిషి దేహ వ్యవస్థ లోని ఫిజికలు (స్థూలం), యాస్ట్రలు (నక్షత్రకం), మెంటలు (మానసికం) అనే మూడు అథో తలాలతో మాత్రమే మేథస్సు అనుబంధం కలిగి ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే, బుద్ధి జీవి అయిన మనిషిలో బుద్ధి క్రియాశీలమై, స్వతంత్రంగా పనిచేయవలసిన అవసరానికి ముందస్తు అవసరం మేథస్సు. యోగ పరంగా చెప్పుకోవాలి అంటే తన నైజంతో మనిషిని లక్షణ పరంగా పూర్తిగా దిగజార్చడానికి మాత్రమే లేదా సృష్టి లక్ష్యం నుండి మనిషిని పూర్తి విముఖంగా తయారు చేయడానికి మాత్రమే మేథస్సు ప్రస్తుతం పనిచేస్తోంది, అలా పనిచేయవలసిన అవసరం కూడ, సృష్టి లక్ష్యపు నెగెటివ్ ప్రథమాంకంగా. అందుకు ఏ ఇతర స్థాయీ సమర్థం కాదు.

7) సృష్టి లక్ష్యంలో మేథస్సు యొక్క పాత్ర ఏమిటి?

8) ప్రస్తుత సృష్టి విధానంలో మనిషిని లక్షణ పరంగా సంపూర్ణంగా దిగజార్చడానికి లేదా బుద్ధి జీవి మనిషిలో బుద్ధి క్రియాశీలం కావడానికి అనువైన అట్టడుగు అథో స్థాయికి (లక్షణ పరంగా మాత్రమే సుమా) దించడానికి లేదా మనిషిలో బుద్ధి క్రియాశీలం కావడం అనే సృష్టి లక్ష్య ద్వితీయాంకపు ఆరంభానికి అనువైన సృష్టి పరిస్థితి నెలకొనడానికి మాత్రమే బహిర్ముఖంగా పనిచేస్తున్న మేథస్సు తన స్వంత అవనతను (నైచ్యాన్ని) గుర్తించి, తాను దేనిలో భాగమో ఆ బుద్ధి యొక్క నిర్ణయానికి లోబడి దేహ వ్యవస్థ లోని మూడు అథో స్థాయిలను పనిచేయించడం అనే తన అంతర్ముఖ కార్యక్రమానికి మళ్ళవలసిన అవసరం.
Post Reply