సమాధానం నెం.138 - ప్రశ్న నెం.138 (29-1-2022) విషయం " బుద్ధిక్ తలం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.138 - ప్రశ్న నెం.138 (29-1-2022) విషయం " బుద్ధిక్ తలం".

Post by Katakam »

1) బుద్ధిక్ తలం అంటే ఏమిటి?

2) బుద్ధిక్ తలం అంటే వస్తుతః బుద్ధికి సంబంధించిన తలం. మానవ దేహ వ్యవస్థ లోని ఏడు తలాలలో ఇది నాలుగవ తలం. మామూలుగా చెప్పుకుంటే, వివేకం, విచక్షణ/ వివేచన లక్షణాలుగా కలిగి ఉండడం లేదా కలిగి ఉన్నది బుద్ధి అని, దానికి సంబంధించిన తలమే బుద్ధిక్ తలం అని చెప్పుకోనవుతుంది. అక్షర మూలాలకు వెళ్లి చెప్పుకుంటే, స్థూల సూక్ష్మ సృష్టులను మించిన బృహత్ సృష్టికి సంబంధించి ఉండి, వస్తుతః ప్రాణ సంబంధమై ఉండి ఉన్నది బుద్ధి, ఆ తలమే బుద్ధిక్ తలం.

3) బుద్ధిక్ తలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

4) బుద్ధి జీవి అయిన మనిషికి, జీవ దశల లోని మానవ దశకు మాత్రమే ప్రత్యేకమైనది బుద్ధి. వస్తుతః బుద్ధి లక్షణం -అంటే వివేకం, దేనిలో అయినా దానిలో ఉన్న కలగలుపు లక్షణాలను దేనికి దానిని ఏకంగా లేదా దేనికి దానిని ఒకటిగా విడివిడిగా చూడగలగడం, మరియు వివేచన, దేనికి దానిని విడివిడిగా చూడగలగడం మాత్రమే కాక వాటి లోని ప్రతి ఒక్క దాని గురించి యోచన చేయగలగడం- కలిగి ఉన్నప్పటికీ, తనదైన స్థాయితో పనిచేయనిది బుద్ధి జీవి అయిన మనిషి యొక్క ప్రస్తుత పరిస్థితి. సాంప్రదాయ ఆధ్యాత్మికతలో బుద్ధిక్ తలానికి పెట్టబడిన అనాహతం (లేదా అనాహత చక్రం) అనే పేరు లోనే ఈ అర్థం -అంటే అనాహతం, ఆహతం కానిది, దెబ్బ తగలనిది లేదా తాకబడనిది, అన్యాపదేశంగా పనిచేయించబడనిది లేదా దాని తనదైన స్థాయితో పనిచేయించబడనిది- ఇమిడి ఉంది అని గ్రహించనగును.

5) మానవ దేహ వ్యవస్థ లోని ఏడు తలాలలో ఫిజికలు, యాస్ట్రలు, మెంటలు అనే మూడు అథో తలాలు, నిర్వాణిక్, పరనిర్వాణిక్, మహాపర నిర్వాణిక్ అనే మూడు తలాలు ఊర్ధ్వ తలాలు. అథో తలాలకు, ఊర్ధ్వ తలాలకు వారధి లాంటిది బుద్ధిక్ తలం. ఊర్ధ్వ తలాల కార్యక్రమానికి ఏకైక సాధనం గానూ, అథో తలాల కార్యక్రమాన్ని జరిపించవలసిన, జరిపించగలిగిన ఏకైక సాధనం గానూ బుద్ధిక్ తలానిది యోగ క్రియల, ప్రక్రియల, ప్రయోగాల ఫలితంగా పనిచేయడంలో అత్యంత కీలకమైన ప్రాముఖ్యత కలిగిన స్థాయి.

6) బుద్ధిక్ తలానికి, ఆత్మిక తలాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

7) యమ్. కోర్సు 116 వ నామంలో గుంభనంగా ప్రస్తావించబడిన విషయం ఏమిటి అంటే ఆత్మిక తలాల కార్యక్రమం బుద్ధిక్ తలం ద్వారానే ప్రకటితం అవుతుంది అని. అంటే ఆత్మిక తలాలు మూడు యథాతథంగా గుర్తించబడవు అని మరియు వాటి కార్యక్రమం బుద్ధిక్ తలం యొక్క కార్యక్రమం లోతులలో మాత్రమే గుర్తించబడనవుతుంది అని. ఇది సాధ్యం కావడానికి ఉదయం, సాయంత్రం కూర్చుని చేసే ప్రాక్టీసును మించి, ఉదయం ప్రాక్టీసు అనంతరం రాత్రి నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఉన్నతతర యోగా ప్రాక్టీసుగా ఆ రోజు చేయబడిన ఆలోచనలను (నోటి మాటను, శారీరిక చేతను ఆధారం చేసుకుని ఆ చేయబడిన ఆలోచనలను) తిరగ తోడుకోవడం (కె. కోర్సు 29-6-1910) అనే సింహావలోకన ప్రక్రియ ద్వారా మాత్రమే డెవలప్ అయే గమనికయే శరణ్యం.

8) సృష్టి లక్ష్యంలో బుద్ధిక్ తలం యొక్క పాత్ర ఏమిటి?

9) బుద్ధి జీవి అయిన మనిషిలో బుద్ధిక్ తలానికి ప్రాణ ఉనికి స్థానంతో ఉన్న అవినాభావ సంబంధం దృష్ట్యా బుద్ధిక్ తలానిదే అసలైన కీలక పాత్ర. బుద్ధి క్రియాశీలం కావడమే మనిషి లోని దివ్యత్వం గుర్తించబడడానికి ఏకైక ఆలంబన, మనిషి తన లోని దివ్యత్వాన్ని గుర్తించి, స్థూలంగా దివ్యుడు కావడమే సృష్టి లక్ష్యం లోని ఒక మితి.
Post Reply