1) పరనిర్వాణిక్ తలం అంటే ఏమిటి?
2) మాటగా చెప్పుకోవాలి అంటే, నిర్వాణిక్ తలం అంటే తనను తాను నిర్వహించుకునే తలం అని చెప్పుకున్న మీదట, పరనిర్వాణిక్ తలం అంటే పరులను నిర్వహించే లేదా నిర్వహణను వహించే తలం అని అర్థం. దీనికి అర్థం చెప్పుకోవడానికి ముందుగా తెలియవలసిన ఒక విషయం ఏమిటి అంటే కె. కోర్సులో వ్రాయబడినట్లుగా, పరనిర్వాణిక్ తలం మరియు మహాపర నిర్వాణిక్ తలం అనే రెండు ఆత్మిక తలాలు వస్తుతః వ్యక్తులకు సంబంధించినవి అయినప్పటికీ, అవి వ్యక్తి స్థాయిల చేత నడిపించబడేవి కాక, కేవలం దైవానికి మాత్రమే సంబంధించినవి, ఆ రెండు తలాల కార్యక్రమాలు నడిపించబడడం పరంగా వాటి కంటె ఉన్నతమైన ఏకానికి మాత్రమే సంబంధించినవి.
3) పరనిర్వాణిక్ తలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
4) పరనిర్వాణిక్ తలం ఆత్మిక తలాలలో ఒకటి అయి ఉండి, సృష్టి మానవుల ఆత్మిక లేదా ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన వాటిలో తనను తాను నిర్వహించుకోవడం అనే దానికి సంబంధించిన నిర్వాణిక్ తలం కంటె పై స్థాయిది అయి ఉంది, ప్రస్తుత సృష్టి విధానంలో దైవానికి, సామాన్య జనానికి అనుసంధానకర్తలు అయిన ఆచార్యులు, గురువులు అనే మహానుభావుల ద్వారా జరిపించబడి ఉంది. అంటే, సామాన్య జనానీకం యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం పైనుండి అందిన సమాచారాలు, వగైరాలకు టీకాలు, తాత్పర్యాలు, భాష్యాలు, వివరణలను లిఖిత గ్రంథ రూపాలుగా, ప్రసంగాలుగా, ప్రవచనాలుగా ఈ పరనిర్వాణిక్ తలం యొక్క కార్యక్రమం నడిచింది. కాలక్రమేణా సదరు ఆధ్యాత్మిక ప్రగతి దైనందిన జీవన కార్యక్రమాల నిర్వహణలో భాగం అయిపోయి, వస్తుతః పరనిర్వాణిక్ తలం యొక్క కార్యక్రమం దిగజారిపోవడం అనేది వేరే విషయం.
5) పరనిర్వాణిక్ తలానికి, మహాపర నిర్వాణిక్ తలానికి మధ్య ఉన్న సామ్యం ఏమిటి, తేడా ఏమిటి?
6) ముందుగా సామ్యం గురించి. రెండిటి లోను స్వయం నిర్వహణకు అతీతమైనది కార్యక్రమం. స్వయం నిర్వహణ సంబంధమైన నిర్వాణిక్ తలం కంటె రెండూ ఉన్నత స్థాయిలే/ తలాలే. పర నిర్వహణ లోని స్థాయీ భేదమే ఈ రెండు తలాల మధ్య భేదం.
7) ఇపుడిక భేదం గురించి. రెండు తలాలు పర నిర్వహణకు సంబంధించినవే అయినా, పరనిర్వాణిక్ తలం కేవలం పర నిర్వహణకు -అంటే ఎవరి ద్వారా పర నిర్వహణ జరుగుతుందో, వారికి ఏదో విధంగా అనుబంధం కలిగి ఉన్న పరుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతి నిర్వహణకు- మాత్రమే సంబంధించి ఉంది. మహాపర నిర్వాణిక్ తలం మహత్తు స్థాయి పర నిర్వహణకు -అంటే వ్యక్తి సంబంధమైన అవసరం లేకుండా, దానికి అతీతంగా మహత్తు స్థాయి పరులకు లేదా విశ్వ స్థాయి పరులకు- సంబంధించి ఉంది. అంటే వ్యక్తుల యొక్క వ్యక్తి స్థాయి నిర్వహణకు అతీతంగా, ప్రసంగాల ప్రవచనాల ప్రభావంగా, వాటి సారంగా, విశ్వ వ్యక్తులలో తత్త్వ సంబంధంగా చొరబడి పనిచేసే ప్రక్రియకు సంబంధించి ఉంది.
8) సృష్టి లక్ష్యంలో పరనిర్వాణిక్ తలం యొక్క పాత్ర ఏమిటి?
9) దీని గురించి చెప్పుకోవాలి అంటే ప్రస్తుత సృష్టి విధానంలో జరుగుతూ వస్తున్న పైనుదహరించిన విధానానికి భిన్నంగా, యోగ పరంగా జరగవలసిన, జరుగుతున్న దాని గురించి మాత్రమే చెప్పుకోవలసిన అవసరం. యోగ ఆరంభం ముందు వరకు జరిగిన పరనిర్వాణిక్ ప్రక్రియ సమస్తం కేవలం బహిర్ముఖం, దానిలో సమాచార స్వీకరణ మరియు సమాచార విస్తరణ మాత్రమే తప్ప, వ్యక్తి స్థాయిలలో చోటు చేసుకున్న ఆధ్యాత్మిక ప్రగతి శూన్యం. యోగ పరంగా జరిగే పరనిర్వాణిక్ కార్యక్రమం అంతర్ముఖం, వ్యక్తి స్థాయి ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన ప్రక్రియలను ఎవరికి వారికి, ముందుగా యోగా ప్రాక్టీసు చేసే వారితో మొదలుపెట్టి, జరిపిస్తున్న, జరుగుతున్న వైనం.
సమాధానం నెం.140 - ప్రశ్న నెం.140 (2-2-2022) విషయం "పరనిర్వాణిక్ తలం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm