1) మహాపర నిర్వాణిక్ తలం అంటే ఏమిటి?
2) మహాపర నిర్వాణిక్ తలం అంటే మానవ దేహ వ్యవస్థలో ఉన్నాయి అని చెప్పుకుంటున్న ఏడు తలాలలో అత్యున్నత తలం, అలాగే ఉన్నత ఆత్మిక తలాలు మూడిటి లోను అత్యున్నత తలం, పేరులో ఇమిడి ఉన్న అర్థంగా మహత్తు పరమైన లేదా విశ్వ వ్యాప్తమైన పరుల యొక్క నిర్వహణకు సంబంధించిన తలం. ఇది వ్యక్తులకు లోబడిన తలం కాదని ఇట్టే తెలిసిపోతుంది. ఇదే విషయం కె. కోర్సులో చెప్పబడింది ఏమిటి అంటే పరనిర్వాణిక్ తలం మరియు మహాపర నిర్వాణిక్ తలం కేవలం దైవానికి మాత్రమే సంబంధించినవి అని. వ్యక్తులలో మహాపర నిర్వాణిక్ తలం యొక్క కార్యక్రమం జరగడానికి మాత్రమే ఆ తలం వ్యక్తులలో ఉంది తప్ప, వ్యక్తుల చేత జరిపించబడబడానికి కాదు అని తెలియనగును.
3) మహాపర నిర్వాణిక్ తలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
4) వ్యక్తి స్థాయి సంబంధమైనది, స్వతంత్రత సంబంధమైనది నిర్వాణిక్ తలం. ఇప్పటి వరకు సృష్టిలో మేథావి మహానుభావుల ద్వారా జరిగిన బహిర్ముఖ కార్యక్రమమే పరనిర్వాణిక్ తలం ద్వారా జరిగిన ప్రస్తుత సృష్టి సంబంధ కార్యక్రమం. పరనిర్వాణిక్ తలం ద్వారా వ్యక్తి స్థాయిలను నిర్వహించే కార్యక్రమం యొక్క సూత్రం/ తత్త్వం ప్రాతిపదికగా జరిగిన బహిర్ముఖ కార్యక్రమమే మహాపర నిర్వాణిక్ తలం యొక్క కార్యక్రమం. సృష్టి లోనికి దిగిరాని మూల స్థితులు సృష్టి లోనికి దిగివచ్చి వ్యక్తుల మహత్తు స్థాయిని లేదా మహత్తు పరమైన/ విశ్వ వ్యాప్తమైన కార్యక్రమాన్ని అంతర్ముఖంగా పనిచేయించడమే మహాపర నిర్వాణిక్ తలం యొక్క జరగవలసిన, జరుగుతున్న కార్యక్రమం.
5) మహాపర నిర్వాణిక్ తలానికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి?
6) ఈ ప్రత్యేకత కేవలం మహాపర నిర్వాణిక్ తలానికి మాత్రమే సంబంధించి ఉంది అని ఇక్కడ గ్రహించనగును. ఏమిటి అంటే వ్యక్తి స్థాయిల నిర్వాణిక్ తలం కార్యక్రమం గానీ, వ్యక్తి సమాజాల పరనిర్వాణిక్ తలం కార్యక్రమం గానీ, జరిపించేది మహాపర నిర్వాణిక్ తలం కార్యక్రమం ద్వారానే. ఆ జరిపించేది మూల స్థితులు అయిన మొదటి ఆది, రెండవ ఆది లేదా మొదటి ఏకం, రెండవ ఏకం లేదా ప్రాణం, శక్తి మాత్రమే, సంయుక్త కార్యక్రమంగా. విశ్వ వ్యాప్తమైన వ్యక్తుల ఏకాలకు/ మూలాలకు సంబంధించి జరిపించబడే మహాపర నిర్వాణిక్ కార్యక్రమం వలన మాత్రమే వ్యక్తుల నిర్వాణిక్ స్వతంత్రత సిద్ధించడం లేదా సుస్థిరపడడం సంభవించేది.
7) సృష్టి లక్ష్యంలో మహాపర నిర్వాణిక్ తలం యొక్క పాత్ర ఏమిటి?
8) నూతన సృష్టి విధానం ఆవిష్కరించబడడం అనే సృష్టి లక్ష్య ద్వితీయ అంకంలో వ్యక్తి ఏకాలకు స్వతంత్రత లేదా నిర్వాణిక్ స్వతంత్రత సిద్ధించడంలో వ్యక్తి ఏకాలను పనిచేయించే లేదా వ్యక్తి ఏకాల ద్వారా అథో తలాల కార్యక్రమాలను సృష్టి లక్ష్యానికి అనుగుణంగా నియంత్రించే మూల స్థితులు సృష్టికి అతీతమైన, సృష్టి లోకి దిగిరావలసిన ప్రాణం, శక్తి అయితే, అందుకు సంబంధించింది మహాపర నిర్వాణిక్ తలమే.
సమాధానం నెం.141 - ప్రశ్న నెం.141 (4-2-2022) విషయం "మహాపర నిర్వాణిక్ తలం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm