1) అజ్ఞానం అంటే ఏమిటి?
2) దీని ముందరి ప్రశ్న, సమాధానం నెం.156 విషయం "జ్ఞానం" లో అజ్ఞానం గురించి కొంత క్లుప్తంగా చెప్పుకోవడం జరిగింది అజ్ఞానం అంటే జ్ఞానం, జ్ఞ ల కంటె ముందరి స్థితి, ఉనికి రహిత శూన్య స్థితులకు సంబంధించింది అని.
3) ఎలా అయితే శూన్య స్థితులు అంటే శూన్యం అనే మరియు శూన్యం యొక్క స్థితులు అని తప్ప, వాటి పేర్లు సైతం సృష్టికి అందకపోవడం మాత్రమే కాక, ఈ మాస్టరు యోగ ఆరంభం అనంతరం వాటి పేర్లు బయటికి వచ్చినా వాటి వివరణ అంత తేలికగా సాధ్యం కాలేదో, అదే మాదిరిగా అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం అని మాత్రమే తప్ప, దాని లోతులు ఉన్నాయి అని కూడ చెప్పుకోలేని పరిస్థితి.
4) ఈ మాస్టరు యోగ ఆరంభం అనంతరం యోగా రికార్డులలో శూన్య స్థితుల ప్రస్తావన చేయబడి ఉన్న కారణంగా, అజ్ఞానం అనేది వస్తుతః శూన్య స్థితులకు -అది కూడ ఉనికి రహిత శూన్య స్థితులకు సంబంధించినదిగా- తెలియవచ్చింది. వస్తుతః అజ్ఞానం గురించి చెప్పుకోవాలి అంటే శూన్య స్థితులకు అన్వయించి మాత్రమే చెప్పుకోను వీలవుతుంది. కానీ, శూన్య స్థితుల గురించి, వాటి వివరణల గురించి తెలియడం అంత తేలికైన విషయం కాదు గనుక, అజ్ఞానం గురించిన వివరణ కూడ అంత తేలికైన విషయం కాదు. సృష్టి పరిధులకు అతీతంగా యోచన చేయగలిగిన పరిస్థితి ఉత్పన్నమైనపుడు మాత్రమే అజ్ఞానం యొక్క శూన్య స్థితి రూపం సాక్షాత్కరిస్తుంది, అది కూడ జ్ఞానం అనే పదం యొక్క కేవల సమాచార సేకరణ అనే ప్రభావం సమూలంగా శూన్యం అయినపుడు మాత్రమే.
5) జ్ఞానం, అజ్ఞానం లలో ఏది ముందు? ఎలా?
6) జ్ఞానం, అజ్ఞానం లలో అజ్ఞానమే జ్ఞానం కంటె ముందరిది. పైన చెప్పుకున్నట్లుగా, శూన్య స్థితుల గురించి తగినంత అవగాహన ఉంటే తప్ప, ఈ విషయాన్ని ఉద్ఘాటించి చెప్పనవదు. సూక్ష్మం నుంచే స్థూల రూపాలతో కూడిన స్థూల సృష్టి ఉద్భవం అయిందని, ఆ సూక్ష్మం కంటె లేదా సూక్ష్మ సృష్టి కంటె ముందు ఏమీ లేనిది/కానిది కానీ ఏమయినా కాగలిగినది ఉండి ఉండాలి అనే అపురూపమైన భావనకు దీటుగా/ సాకారంగా అదే శూన్యం అని చూచాయగా అయినా అనుభూతం కాగలిగి, శూన్యం లేదా శూన్య స్థితి ఉంది అని ఒకలాంటి ఇదమిత్థతతో యోచన చేయగలగడం మాత్రమే అలాంటి ఉద్ఘాటనకు దారితీస్తుంది.
7) మాస్టరు గారి డైరీలలో 11-7-1918 న "నథింగ్ విల్ టచ్ షెయిన్" అని ఆంగ్లంలో వ్రాయబడి ఉన్న దానికి సాధారణ అర్థంగా "ఏదీ షెయినును తాకబోదు" అనీ, శూన్య స్థితుల ప్రక్రియ పరమైన అర్థంగా "నథింగు (6వ శూన్య స్థితి, ప్రాణానికి లేదా ప్రాణం అనే ఉనికి ఏర్పడిన స్థితి) మాత్రమే షెయినును తాకబోతుంది" అనీ; ఇంకా 21-9-1918 న "ఫౌండ్ నథింగ్ ఇన్ వర్కింగ్" అని ఆంగ్లంలో ఉన్న దానికి సాధారణ అర్థంగా "వర్కింగులో ఏమీ కనుగొనబడలేదు" అనీ, శూన్య స్థితుల ప్రక్రియ పరమైన అర్థంగా "వర్కింగులో నథింగును కనుగొనడమైనది" అనీ; అలాగే 22-9-1918 న "నో పర్సెప్టిబుల్ వర్కింగ్ గివెన్" అని ఆంగ్లంలో వ్రాయబడి ఉన్న దానికి సాధారణ అర్థంగా "గుర్తించదగిన ఏ వర్కింగు ఇవ్వబడలేదు" అనీ, శూన్య స్థితుల ప్రక్రియ పరమైన అర్థంగా "నో (నథింగు తదనంతరపు ఒక శూన్య స్థితి) అనే గుర్తించదగిన వర్కింగు మాత్రమే ఇవ్వబడింది" అనీ - ఇవి శూన్య స్థితులకు సంబంధించి మాస్టరు యోగ రికార్డులలో వెల్లడించబడిన కొన్ని విషయాలు, జ్ఞ కు లేదా ప్రాణ లక్షణానికి సంబంధించిన యోగా వర్కింగులు. ప్రాణ ఉనికి ఏర్పడడం కంటె ముందరి స్థితులలో ఉనికి రహిత శూన్య స్థితుల సంబంధంగా ఉండి ఉన్నదే అజ్ఞానం.
8) జ్ఞానం, అజ్ఞానానికి దారితీస్తుందా లేదా అజ్ఞానం జ్ఞానానికి దారితీస్తుందా? ఎలా?
9) పైన అంత వివరంగా చెప్పుకున్న మీదట, ముందరి స్థితి అయిన అజ్ఞానమే జ్ఞానానికి దారితీస్తుంది అనేదే అసలైన వాస్తవం, ఒక పట్టాన మింగుడు పడని పరిస్థితి అయినా కూడ. యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాల ఫలితాలు యోగా ప్రాక్టీసులో చోటు చేసుకున్న కారణంగా డెవలప్ అయే గమనిక ద్వారా మాత్రమే సాధ్యపడే అసలైన అర్థం లోని జ్ఞానం గణనీయంగా పెరిగినపుడు మాత్రమే రుచి (విద్యార్థి ద్వారా రికార్డు 3-2-1912) అనే తత్త్వంలో గుంభనంగా ఇమిడి ఉన్న 'తన నేను అంటే ఏమిటో తానుగా తెలుసుకోవడం' అనే ఒక వ్యక్తి స్థాయి మితి సాకారమై, అజ్ఞానం గురించి లీలగా తెలిసే అవకాశం.
10) కానీ, ప్రస్తుత సృష్టి విధానానికి ఆలవాలమైన సమాచార సేకరణ అనే జ్ఞానం అసలైన అర్థం లోని జ్ఞానానికి దారితీసేలా శూన్య స్థాయికి చేరుకుంటేనే, జ్ఞానానికి మరియు జ్ఞకి ముందరి స్థితి అయిన అజ్ఞానం జ్ఞానాన్ని మించినదిగా, జ్ఞానానికి దారితీసేదిగా తెలియనయే అవకాశం.
సమాధానం నెం.157 - ప్రశ్న నెం.157 (8-3-2022) విషయం "అజ్ఞానం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm