సమాధానం నెం.160 - ప్రశ్న నెం.160 (14-3-2022) విషయం "జ్ఞ".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.160 - ప్రశ్న నెం.160 (14-3-2022) విషయం "జ్ఞ".

Post by Katakam »

1) జ్ఞ అంటే ఏమిటి?

2) జ్ఞ అంటే ఏమిటి అని వివరించుకోవడం కంటె ముందుగా ప్రస్తావన చేయవలసిన విషయం ఏమిటి అంటే జ్ఞ అనేది వస్తుతః ఆరిజినుకు లేదా మొదటి ఆదికి లేదా మూలప్రాణానికి (వ్యక్తుల/ మనుషుల లేదా జీవుల/ప్రాణుల ప్రాణాలకు/ ప్రాణతరంగాలకు కాక) లేదా మొదటి ఏకానికి మాత్రమే సంబంధించింది తప్ప, మనిషికి లేదా విశ్వ జీవులకు గానీ, విశ్వానికి గానీ, సృష్టికి గానీ సంబంధించింది కాదు అని.

3) జ్ఞ అంటే కనీసం అరుదుగా కూడ ఏకాక్షర పదంగా వాడబడని మూల అర్థంలో తెలిసిఉండినతనం. ఇది భాషా సంబంధమైన అక్షరం అయినప్పటికీ, భాషలో, భాషణలో, సంభాషణలో ఎక్కడ కూడ ఉపయోగించబడని అక్షరం. అంతేకాదు, వాడబడని అక్షరంగా, పలకడానికి లేదా ఉచ్చరించడానికి అంత తేలిక కానిది అయిన అక్షరంగా దాని రూపులో కూడ మార్పు చోటు చేసుకుంది. ఆ అక్షరం యొక్క అసలు రూపం ఙ్ఞ, అంటే ఙ కు ఞ వత్తు. ఇది కాలగతిలో జ్ఞ గా, అంటే జ కు ఞ వత్తుగా, రూపు దిద్దుకుంది. అలా రూపు దిద్దుకోవడంలో కూడ సృష్టి/ విశ్వ పరంగా మరియు సృష్ట్యాతీత/ విశ్వాతీత ప్రక్రియ పరంగా సృష్టికి అందనంత, అందనవసరం లేనంత గుంభనంగా అత్యంత నిగూఢ సూచన ఇమిడి ఉన్నప్పటికీ, అది చెప్పుకోవలసినదిగా ప్రస్తుత అవసరం కాదు.

4) అక్షర మూలాలకు వెళ్ళి చెప్పుకుంటే‌, ఙ్ఞ (ప్రస్తుతం వాడబడుతున్న జ్ఞ అనే దాని మూల అసలు రూపం) అంటే పూర్తి అయిన ప్రథమ ఉనికికి లేదా ప్రాణ ఉనికికి లేదా ఆదికి దాని లోనే ఉన్న ఉనికి రహిత చలనానికి పూర్తి అయిన ప్రథమ చలన ఉనికి లేదా ప్రథమ/ఆది శక్తి, రెండిటి సంయుక్త ఉనికి.

5) జ్ఞ అనేది ప్రాణ లక్షణం, ప్రేరణ అనే లక్షణం, తెలిసిఉండినతనంగా శక్తిలో, శక్తికి ప్రేరణగా ఉండే లక్షణం.

6) జ్ఞ కు, జ్ఞానానికి మధ్య సంబంధం ఏమిటి?

7) ప్రశ్న, సమాధానం నెం.156 విషయం "జ్ఞానం" లో జ్ఞానం గురించి వివరంగా చెప్పుకోవడం జరిగింది. జ్ఞ కు, జ్ఞానానికి మధ్య ఉన్న సంబంధం గురించి జ్ఞ యొక్క క్రింది స్థాయి విస్తరణయే జ్ఞానం అని కూడ చెప్పుకోవడం జరిగింది.

8) ప్రస్తుత సృష్టి విధాన సంబంధంగా -అంటే సృష్టి స్థాయిలకు లోబడి కేవలం సమాచార సేకరణయే జ్ఞానం అని పరిగణించబడుతున్న ప్రస్తుత సృష్టి విధాన సంబంధంగా- ఉన్న జ్ఞానం యొక్క అసలైన స్థాయికి మూలం మూల స్థాయి జ్ఞ. జ్ఞానం ఎన్నటికీ జ్ఞ కానేరదు. జ్ఞ యే జ్ఞానంలో తన స్థాయితో పనిచేయవలసిన అవసరం.

9) ప్రాణ సంబంధమైన జ్ఞ ఎందుచేత వ్యక్తి సంబంధం, విశ్వ సంబంధం, సృష్టి సంబంధం కాదు?

10) జ్ఞ, లేదా ఖచ్చితంగా చెప్పుకుంటే‌ ఙ్ఞ, అనేది ప్రాణం అనే మూల స్థితి యొక్క మూల నైజం. సృష్టిలో -అందులో ముఖ్యంగా సృష్టి ప్రక్రియకు లేదా సృష్టిక్రమవికాస ప్రక్రియకు మకుటాయమానం అయిన మనిషిలో- వస్తుతః ప్రాణం లేదు అని, ఉన్నది కేవలం ప్రాణతరంగం మాత్రమే అని సృష్టికి తెలియని, ఈ యోగ పరంగా మాత్రమే బయటపడిన, విషయాన్ని ఆధారం చేసుకుని ఈ అంశాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం. ఏమిటి అంటే సృష్టి జీవులకు సంక్రమించిన ప్రాణం మూల స్థితి ప్రాణం కాక, సృష్టి జీవుల నిమిత్తం స్థాయిలు దిగి సృష్టి లోకి వచ్చిన సృష్టి ప్రాణం మాత్రమే, ఒక జీవిత కాలానికి సరిపోయే విధంగా జీవునిలో/ మనిషిలో ప్రవేశించే ప్రాణతరంగం మాత్రమే.

11) ఈ కారణంగా, ప్రాణానికి లేదా మూలప్రాణానికి యథాతథంగా సంబంధించిన జ్ఞ అనేది జ్ఞానం యొక్క క్రింది స్థాయితో సరిపుచ్చుకుంటున్న మనిషికి, మనుషుల సమిష్టి స్థాయి అయిన విశ్వానికి, విశ్వానికి పరిమితమైన సృష్టికి సంబంధించి ఉండలేదు.
Post Reply