సమాధానం నెం.161 - ప్రశ్న నెం.161 (16-3-2022) విషయం "అరిషడ్వర్గాలు".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.161 - ప్రశ్న నెం.161 (16-3-2022) విషయం "అరిషడ్వర్గాలు".

Post by Katakam »

1) అరిషడ్వర్గాలు అంటే ఏమిటి?

2) అరిషడ్వర్గాలు అంటే ఆరు శత్రువులు లేదా ఆరు శత్రు వర్గాలు అని అర్థం కదా. అయితే, అవి దేనికి లేదా వేటికి శత్రువులు అని ప్రశ్న వేసుకుంటే, మనిషికి అని చెప్పుకోవడం చాలా సులువే. కానీ, అవి ఎలా శత్రువులు, ఎందుకు శత్రువులు అనే ప్రశ్నకు కొంత తడవు ఆగవలసిందే. ఎందుకు అంటే అది సరయిన రీతిలో మేథస్సుకు అందే విషయం కాదు గనుక. అది ఎందుకు అంటే వాటి పుట్టుక మేథస్సుకు సంబంధించింది గనుక, మేథస్సులో అవి భాగం గనుక, తనను తప్ప దేనినీ తనకు సమానంగా పరిగణించకపోవడం మరియు అంతకు మించి పైకి ఎదిగే అవకాశం లేకపోవడం మేథస్సు యొక్క నైజం గనుక. ఇలా అని చెప్పుకోవడం కొంత వరకు సమంజసమే అయినప్పటికీ, లోతుల వాస్తవం మరికొంత భిన్నం. ఏమిటి అంటే అరిషడ్వర్గాలు వస్తుతః నేనుకు శత్రు వర్గాలు. ప్రస్తుతం నేనుగా, అసలు నేనుకు సమాంతరమైన నకిలీ నేనుగా చెలామణి అవుతున్న మేథస్సుకు శత్రు వర్గాలు. ఇది మనిషిలో మేథస్సు యొక్క పరిఢవిల్లుడుతో పరిణమించిన పరిస్థితి. అయితే, ఇక్కడ తెలియవలసిన విషయం ఏమిటి అంటే అసలు నేను దేనికయినా, ఎవరికయినా శత్రువు కావచ్చునేమో గానీ, అసలు నేనుకు ఏదీ, ఎవరూ శత్రువు కాదు.

3) అరిషడ్వర్గాలు మొత్తంగా మనిషిలో మాత్రమే ఎందుకు ఉన్నాయి?

4) సృష్టి లోని జీవదశలలో సృష్టి లక్ష్య సంబంధమైన చివరి రూపం ఆకృతి పరంగా మనిషి గనుక, లక్షణ పరంగా పరిపూర్ణతను సంతరించుకోవలసిన అవసరం ఉన్న రూపం మనిషిదే గనుక, అందుకు నిదర్శనం కేవలం మనిషి మాత్రమే బుద్ధి జీవి అయి ఉండడం గనుక, ప్రస్తుతం బుద్ధి కేవలం జీవన కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగపడుతూ సృష్టి లక్ష్యం సిద్ధించడంలో భాగంగా తన అసలైన స్థాయితో పనిచేయవలసిన అవసరం గనుక, అందులో ముందస్తు భాగంగా నెగెటివ్ లక్షణాలు ఉత్పన్నమై పూర్తి స్థాయికి వికటించి బుద్ధి స్థాయి లక్షణాలలో విలీనం కావలసిన అవసరమే అరిషడ్వర్గాలు మొత్తంగా మనిషిలో ఉండడానికి కారణం.

5) మానవ జీవనంలో అరిషడ్వర్గాల పాత్ర ఏమిటి?

6) వస్తుతః మానవ స్థూల శరీరం కర్మ సంబంధ విధానంలో భాగంగా కర్మ పదార్థంతో తయారయి ఉంది గనుక (మానవ స్థూల శరీరం, కర్మ పదార్థం - మాస్టరు గారి డైరీలు 29-9-1912), కర్మ పదార్థం మానవ ఉనికికి సంబంధించి నెగెటివ్ (ప్రతికూలం) మాత్రమే గనుక, సమయానుసారంగా సందర్భాన్ని బట్టి అరిషడ్వర్గాల ప్రభావం బయటికి నెట్టబడి, వాటి లోతులకు సంబంధించిన యోచన చేయడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. కానీ, దానికి భిన్నంగా, మనిషి వాటిని అదుపులో ఉంచుకోవడం అనే ప్రయత్నపూర్వక ప్రక్రియకు మాత్రమే మొగ్గు చూపుతున్నాడు, దానినే ఉండదగిన ఉన్నత స్వభావంగా పరిగణిస్తున్నాడు. ఈ యోగం ఆరంభమైన అనంతరం లోపలి లోతులను కదిలింది కుదిలించి, వాటి స్వరూప స్వభావాలను లోపల ఉన్నట్లుగా బయటికి తెలిసేలా చేయడమే యోగ విధానంలో భాగంగా యోగ క్రియల ఉద్దేశ్యం గనుక, అరిషడ్వర్గాలు ఆపడానికి వీలు లేనంత వేగంగా బయటికి తన్నుకు రావడం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. దాని సంబంధంగా లోతులలో ఏం జరుగుతుందో తెలియడం డెవలప్ అయిన గమనికకు మాత్రమే సాధ్యం.

7) సృష్టి/ యోగ లక్ష్య సిద్ధిలో అరిషడ్వర్గాల పాత్ర ఏమిటి?

8) ఇంతవరకు పైన చెప్పుకున్నది అరిషడ్వర్గాలకు సంబంధించిన నెగెటివ్ లోతుల గురించి మాత్రమే. వాటి లోని నెగెటివ్ లోతులు వ్యక్తి సంబంధం, వ్యక్తుల సమిష్టిగా విశ్వ సంబంధం.

9) వ్యక్తి సంబంధంగా మరియు వ్యక్తుల సమిష్టి అయిన విశ్వ సంబంధంగా బహిర్ముఖంగా మాత్రమే పనిచేసే అరిషడ్వర్గాలు, సృష్టి/ యోగ లక్ష్యంలో భాగంగా మరియు సృష్టికి అతీతమైన మూల స్థాయిల నుంచి వ్యక్తుల స్థూలాల లోని సూక్ష్మ మూల స్థాయిలలో యోగ క్రియల ఫలితంగా, అంతర్ముఖంగా పని చేయవలసిన అవసరం. అంటే ఒక ఉదాహరణగా - అంతర్లీనమైన అరిషడ్వర్గాలు లక్ష్య సంబంధమైన అవసరానికి అనుగుణంగా అవసరం మేరకు వ్యక్తి లోపల ప్రకటితమై, తన నేనును తాను తెలుసుకోవడం/ చేరుకోవడం అనే సృష్టి/ యోగ లక్ష్యంలో, లక్ష్య సిద్ధిలో పాత్ర వహించడం జరుగుతుంది.
Post Reply