1) జననం అంటే ఏమిటి?
2) జననం అంటే జన్మించడం లేదా పుట్టడం/ పుట్టుక. జననం అనే మాటకు జన్మ అనే మాట పర్యాయపదంగా వాడనవుతుంది. ఈ సందర్భంగా చెప్పుకోదగిన ఒక విషయం ఏమిటి అంటే జన్మ తీసుకోవడం -అంటే స్థూలానికి సంబంధింపచేసే విధంగా జన్మ తీసుకోవడం, అంటే స్థూలానికి లేదా స్థూల స్థాయికి కర్తృత్వాన్ని ఆపాదించే లాంటి జన్మ తీసుకోవడం- అనేది, ప్రక్రియ పరమైన లోతుల మూల స్థాయి అర్థాలను పరిగణన లోకి తీసుకోగలిగితే, అసంగతం, అసంబద్ధం, అసమంజసం, అసాధ్యం, అసంభవం అని చెప్పుకోక తప్పదు. జన్మ తీసుకోవడం అనే దానిని స్థూలానికి సంబంధింపచేసి సకర్మక క్రియగా తీసుకోవడం అనే దాని పరిస్థితి ఇంతే. ఒక మూల స్థాయి భావనగా -అంటే స్థూలంగా రావడం కంటె ముందుగానే స్థూలం ఉనికి లోనికి వచ్చిన అనంతరం పనిచేయవలసిన మూల భావనగా- స్థూలానికి మూల స్థాయి సకర్మకతను ఆపాదించడమే కర్మ విధానానికి నాంది. 'నేను చేస్తున్నాను' అనే అందని లోతుల స్థూల స్థాయి భావనయే కర్మ విధానానికి, కర్మ సంపాదనకి, కర్మ ప్రభావ అనుభవానికి, కర్మ ప్రక్షాళన కావలసిన అవసరానికి, అందునిమిత్తం ఈ మాస్టరు యోగం ఈ భూమి మీద ఆరంభం కావడానికి ఊపిరి.
3) జననం ఎవరికి/ దేనికి సంబంధించింది?
4) జననం ఎవరికి/ దేనికి సంబంధించింది అనే ప్రశ్న లోనే కొంత వివరణ లభించేలా అనుమానం, దానికి కొనసాగింపుగా ప్రశ్న ఉత్పన్నం అయ్యే అవకాశం. జననం అనేది ఎవరికి అనే దానిని మించి దేనికి అనేదే సమంజసం అని చూచాయగా తెలిసే అవకాశం.
5) జననం యొక్క తదనంతరపు స్థూల రూపం సూక్ష్మానికి లేదా సూక్ష్మ స్థాయికి స్థూల స్థాయిగా రూపు దిద్దుకున్నటువంటిది. కనుక, జననం స్థూలానికి కాదు, ఎవరికి అనేది కాదు అని నిర్ధారితం అవుతుంది. ఉనికి లేదా ప్రాణ ఉనికి ఏర్పడిన అనంతరం కలిగే ప్రథమ జన్మ జన్మకు రావలసిన వ్యక్తికి వ్యక్తి స్థాయికి పరిమితమై సంక్రమించే సృష్టి కర్మ భాగానికి కొనసాగింపుగా వచ్చేది గనుక, జన్మ తీసుకునేది కేవలం ఆ ప్రాణ ఉనికియే. ఉనికి స్థూలానికి రావడమే జననం, ప్రాణం కర్మ సంబంధంగా స్థూల ఉనికి తీసుకోవడమే జననం.
6) జననం యొక్క సాఫల్యం మరణమేనా?
7) జననం యొక్క సాఫల్యం మరణమేనా అని అన్నపుడు, ఉనికి సూక్ష్మం నుండి స్థూలానికి రావడం జరిగింది గనుక, జననం యొక్క సాఫల్యం అనేది సాంప్రదాయ ఆధ్యాత్మిక వేత్తలు ఉగ్గడించి ప్రవచన ప్రచారం చేసినట్లుగా, మరణించి లేదా స్థూలాన్ని విడిచి మరలా సూక్ష్మం లోకి విలీనం కావడమేనా అనేదిగా అర్థం తీసుకోనగును. అది నమ్మక తప్పని పరిస్థితికి సంబంధించిన విషయమే అయినా, నమ్మకానికి విరుద్ధంగా అసమంజసం, అసంబద్ధం, అసంగతం అని మాత్రమే కాక, తార్కికంగా మరియు హేతుబద్ధంగా యోచించిన మీదట, అబద్ధం అని కూడ స్పష్టమయే అంశం. జన్మించిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జననం తప్పదు అనే గీతా వాక్యమే దీనికి నమ్మించబడిన దానిని మించిన నిజమైన, బద్ధమైన వివరణ. కానీ, మరణం ఎందుకు ఉంది అనే దానికి సమాధానం పొందగలిగినపుడు, జననం యొక్క సాఫల్యం మరణమేనా అనే ప్రశ్న సైతం హుళ్ళక్కే అని ఖచ్చితంగా తేలుతుంది.
8) సృష్టి/ యోగ లక్ష్యంలో జననం యొక్క పాత్ర ఏమిటి?
9) ముక్కుసూటిగా, క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే సృష్టి లక్ష్యానికి ఆరంభమే జననం. సృష్టి విధాన పరంగా మరణం అనేది (దాని సృష్టి స్థాయి కారణాలు దానికి ఉన్నప్పటికీ) కామా లాంటిది మాత్రమే, అంటే మరణం ఖచ్చితంగా జననానికి దారితీస్తుంది. ఇది సృష్టి నైజం, సృష్టి విధానం. సృష్టి విధానంలో లోపం లేదు, దానిని అర్థం చేసుకోవడంలో మానవ మేథస్సుదే లోపం. సృష్టి స్థాయి విషయాలు అర్థం కాకపోవడం, అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్పడం, చెప్పుకోవడం మానవ మేథస్సు నైజం.
10) యోగ లక్ష్యంలో జననం యొక్క పాత్ర సాఫల్యానికి సంబంధించింది, యోగ లక్ష్య సిద్ధికి సంబంధించింది. ఎందుకు అంటే జన్మించిన స్థూలమే, జన్మించిన స్థూలం తయారు కావడమే యోగ లక్ష్య సిద్ధికి ఆలంబన, ఆచరణ గనుక. స్థూలం లేని సృష్టి లక్ష్యం గానీ, యోగ లక్ష్యం గానీ నిరుపయోగమే. ఎందుకు అంటే స్థూలమే లేదా జన్మించి ఉంటున్న స్థూలమే సృష్టి లక్ష్యానికి, యోగ లక్ష్యానికి ఏకైక సాధనం గనుక.
సమాధానం నెం.177 - ప్రశ్న నెం.177 (17-4-2022) విషయం "జననం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm