సమాధానం నెం.178 - ప్రశ్న నెం.178 (19-4-2022) విషయం "మరణం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.178 - ప్రశ్న నెం.178 (19-4-2022) విషయం "మరణం".

Post by Katakam »

1) మరణం అంటే ఏమిటి?

2) మరణం అంటే చనిపోవడం, చావు అనేది సార్వజనీనంగా చెప్పుకునే అర్థం. కానీ, స్థూలంలో లేదా స్థూల దేహంలో మార్పులకు గురి అవుతూ స్థూలాల కొనసాగింపులో శాశ్వతంగా -అంటే మరణం లేకుండా- ఉండే సూక్ష్మం ఉంటుంది, అలాగే మరణం లేని, మరణానికి లోబడని, స్థూలాల కొనసాగింపులో శాశ్వతంగా ఉండే ఆత్మ ఉంటుంది. ఇంతకీ మరణం అంటే ఏమిటి అనే లోతుల ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది.

3) సాంప్రదాయ ఆధ్యాత్మిక వేత్తలు చెప్పగా ప్రచారంలో ఉన్న ఒక విషయం ఏమిటి అంటే మరణం స్థూలానికే, శాశ్వతంగా ఉండే ఆత్మకు కాదు అని. స్థూలం లేకుండా పోవడమే స్థూలానికి మరణం అని చెప్పుకోనయితే, స్థూలంతో పాటు స్థూలంలో నుంచి ఆత్మ కూడ లేకుండా పోతుంది కదా, మరి దాని సంగతి ఏమిటి. ఏమీ అర్థం కాని, ఏమీ చెప్పలేని సందిగ్ధావస్థ. లేకుండా పోయే స్థూలంలో నుంచి ఆత్మ లేకుండా పోయినా, ఆ స్థూలానికి సంబంధించి దాని కొనసాగింపుగా వచ్చే స్థూలం లోకి అదే ఆత్మ, శాశ్వతమైన ఆత్మ వస్తుంది అనేది మళ్ళీ మళ్ళీ చెప్పబడిన విషయం. ఒకసారి లేకుండా పోయిన స్థూలం అదిగా మళ్ళీ తిరిగి రాదు, క్రొత్త ప్రారబ్దంతో క్రొత్త స్థూలం వస్తుంది. ఆత్మ మాత్రం అదే మరల వస్తుంది. ఇక్కడ ఇదీ అని ఇదమిత్థంగా చెప్పలేని ప్రశ్న లోతులలో తొణికిసలాడుతుంటుంది.

4) దానికి సమాధానమేమో అన్నట్లుగా, మాస్టరు యోగా రికార్డులలో మరణం అనే మాటకు వాడబడిన పంజర మార్పిడి అనే పదజాలం దీనికి అసలైన వివరణను ఇస్తుంది. పంజర మార్పిడి అంటే దేహ పంజర మార్పిడి. అంటే ఒక దేహ పంజరం పోయి, మరొక దేహ పంజరం రావడం. ఈ పదజాలం లోనే తదుపరి ప్రశ్నకు కూడ సమాధానం చెప్పుకోనవుతుంది.

5) మరణం ఎవరికి/ దేనికి సంబంధించింది?

6) క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే పంజర మార్పిడి అనే ప్రక్రియ సంబంధమైన అర్థాన్ని తెలియచేసే పదానికి (అందరికీ తెలిసిన మాటగా) మరణం ఆత్మకు -సాంప్రదాయ బద్ధంగా చెప్పబడిన ఆత్మ అనే మాట లెక్కకు మించిన అర్థాలతో శరీరానికి, శరీరం లోని ప్రతి భాగానికి/ అవయవానికి అన్వయించబడి, సందర్భ సహితంగా అన్వయించడానికి వీలులేనంత విభిన్న రీతులలో వాడబడింది గనుక- లేదా యోగ సంబంధంగా వాడబడిన స్టెబిలిటీకి (స్థిరంగా ఉండేదానికి) లేదా ప్రాణానికి సంబంధించింది. ప్రతి మరణానికి కొనసాగింపుగా స్థూలం తీసుకోబడుతుంది. అదే పంజర మార్పిడి. ఆ పంజర మార్పిడి ఎందుకు ఉంది అనేది ఏకంగా సృష్టి లక్ష్యానికే, మానవ మేథస్సుకు ఈషణ్మాత్రం అందని, అంది ఉండని, అందదగని, అందబడకూడని సృష్టి లక్ష్యానికే సంబంధించి ఉంది. కానీ, ప్రస్తుతానికి వివరణ అప్రస్తుతం.

7) పునర్జన్మకు దారితీసే మరణానికి అంతం ఏమిటి?

8) మరణానికి అంతం లేకుండా పోవడం అంటే మరణం అనేది లేకుండా పోవడమే. మరణం అనేది లేకుండా పోవడమే మరణ రాహిత్యం. కానీ, మరణ రాహిత్యం అనేది వ్యక్తికి సంబంధించిందే అయినప్పటికీ, అది సృష్టి స్థాయి ప్రక్రియగా వ్యక్తులలో చోటు చేసుకునేదే తప్ప, సృష్టి స్థాయి సంబంధమైన మార్పు కాదు. మరణం ఎందుకు ఉంది, మరణం పునర్జన్మకు ఎందుకు దారితీస్తుంది అనే విషయాల లోతులు ఏకంగా సృష్టి లక్ష్యానికే సంబంధించి ఉన్నాయి. 'మృత్యోర్మా అమృతం గమయ' -అంటే మృత్యువు నుండి అమృతత్వం వైపుకు మమ్ములను నడిపించవలసినది- అనే అభ్యర్థనా పూర్వక సూక్తం మరణ రాహిత్యం -అంటే నెగెటివ్ నెగెటివ్ చేయబడగా కలిగే ఒక స్థితి- అనే అంశాన్ని మించి అమృతత్వం -మరణాన్ని జయించడం లేదా మరణం లేకుండా పోవడం అనే మరణ రాహిత్యానికి అతీతంగా నెగెటివ్ నెగెటివ్ చేయబడిన అనంతరం పాజిటివ్ గా నెలకొనవలసిన స్థితి- అనేది సృష్టి ఆరంభం కంటె ముందుగానే ఉన్న సృష్టి విధానానికి రావలసిన మార్పుకు సంబంధించింది.

9) సృష్టి/ యోగ లక్ష్యంలో మరణం యొక్క పాత్ర ఏమిటి?

10) మరణం యొక్క పాత్ర గురించి కంటె ముందుగా చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే జన్మించిన తరువాత మరణించక తప్పదు, మరణించిన తరువాత జన్మించక తప్పదు అనే వాస్తవ సృష్టి ఘటన ఉన్నా కూడ, మనిషికి మరణం అంటే భయం ఎందుకు ఉంది, ఆ భయం లోతులలో మరణించకుండా ఉండాలి అనే అంతర్లీన భావన ఎందుకు ఉంది అనే విషయాల లోతులను పరిగణన లోకి తీసుకుని చూస్తే, మృత్యోర్మా అమృతం గమయ అనేది ప్రతి జీవిలో, ప్రతి జీవి లోని ఉనికి లోతులలో ఉన్న విషయం అని చూచాయగానే అయినా ఖచ్చితంగా తెలియవస్తుంది.

11) సృష్టి/ యోగ లక్ష్యంలో మరణం యొక్క పాత్ర అనేది అమృతత్వం నెలకొనడంలో -అంటే సృష్టి లక్ష్యంగా చెప్పుకోదగిన అమృతత్వం నెలకొనడంలో- మరియు యోగ లక్ష్యంగా చెప్పుకోదగిన 'ఫిజికలు ఎస్టాబ్లిష్' (స్థూలం సుస్థిరపడడం లేదా అమృతత్వ స్థితి రావడం) లో ప్రస్తుతానికి ఒక మాధ్యమిక స్థాయిగా, ఎప్పటికప్పుడు -అంటే జన్మ జన్మకు ముగింపుగా స్థూలం కూలిపోయి మరల స్థూలం వచ్చినపుడు, జీవనంలో సదరు సందర్భాలు చూడడం తటస్థించినపుడు- దేహ వ్యవస్థ లోతులలో అమృతత్వాన్ని గుర్తు చేసేదిగా ఉండడమే.
Post Reply