సమాధానం నెం.179 - ప్రశ్న నెం.179 (21-4-2022) విషయం "జన్మరాహిత్యం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.179 - ప్రశ్న నెం.179 (21-4-2022) విషయం "జన్మరాహిత్యం".

Post by Katakam »

1) జన్మరాహిత్యం అంటే ఏమిటి?

2) జన్మరాహిత్యం అనే సాంప్రదాయబద్ధ ఆధ్యాత్మిక పదానికి అర్థం జన్మ లేకుండా పోవడం అని తేలికగానే చెప్పుకోవచ్చు. అంటే జన్మించి, జీవనం/ జీవితం గడిపి, మరణించిన తరువాత మరల జన్మకు రాకుండా ఉండడం. ఈ అర్థమే వస్తుతః ప్రపంచం అంతటా ప్రచారంలో ఉన్న విషయం. జన్మ లేకుండా పోవడం అంటే మరణించిన తరువాత ఆ దేముడిలో/ భగవంతుడిలో ఐక్యం అయిపోవడం. దీనికే మళ్ళీ మోక్షం అనే పేరు కూడ జోడించబడింది. అంటే జన్మించడం అనే దాని నుండి విముక్తి చెందడం లేదా విమోచనం అని. జన్మరాహిత్యం అనేది అసంగతం, అసంబద్ధం, అసమంజసం, ప్రక్రియ పరంగా అసాధ్యం, అసంభవం అనే విషయాలు తదుపరి ప్రశ్న భాగాలు, వివరణలలో తేటతెల్లం అవుతాయి.

3) జన్మ తోనే సృష్టి ఆరంభం అయ్యింది. అది మరణంతో ఆగిపోతుంది అంటే అసలు జన్మకు రావడం అనే సృష్టి కార్యక్రమం యొక్క అవసరం ఏమిటి. మరి సృష్టి ఎందుకు జరిగింది. దీనికి మేథో మహానుభావుల తపస్సు, సాధనల ఫలితంగా వాళ్ళకు పైనుంచి అందిన సమాచారం 'అది (= అంటే సృష్టి) భగవంతుని లీల, చిద్విలాసం' అని. లీల, చిద్విలాసం అనే సృష్టి స్థాయి మాటలకు గొప్ప మేథస్సుకు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ, లీల అంటే క్రీడ అనే అర్థం కూడ ఉంది గనుక, సృష్టి భగవంతునికి ఒక క్రీడ, భగవంతుడు సృష్టితో ఆడుకుంటున్నాడు అనేదే మానవ మేథస్సులో నాటుకుపోయింది. దాని గురించి మరొక ప్రశ్న పడడం అనేది మేథస్సుకు అసంభవం అయిపోయింది.

4) మానవ జీవనంలో జన్మరాహిత్యం యొక్క పాత్ర ఏమిటి?

5) మానవ జీవనంలో జన్మరాహిత్యం యొక్క పాత్ర అనడం కంటె జన్మరాహిత్యం అనేదే మానవ దేహంలో ముమ్మూర్తులా జీర్ణించుకుపోయింది అనడమే సమంజసం. ఎందుకు అంటే మనిషికి జన్మ సాఫల్యంగా చెప్పబడిన జన్మరాహిత్యం అనే దానికి అనుగుణంగానే మానవ జీవన/ జీవిత సంబంధమైన ప్రతి దానికీ మేథో పరమైన అర్థాలు చెప్పబడ్డాయి గనుక, అవే అప్రతిహతంగా పాటించబడుతూ వస్తున్నాయి గనుక, బ్రతికి ఉండగా మంచి పనులు చేయడం ద్వారా పుణ్యం సంపాదించుకోవడం వలన దేముడిలో ఐక్యం కావడం అనేది సాధ్యం అవుతుంది అని చెప్బబడింది గనుక.

6) అది ఎంతవరకు అంటే ఆధ్యాత్మిక సాహిత్యం మొత్తం కూడ దానికి అనుగుణంగానే రూపొందించబడింది. ఉదాహరణకు - 'శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే', అంటే 'శ్రీశైల శిఖరం దర్శించబడితే పునర్జన్మ ఉండదు' అని. శ్రీశైలంలో గుడికి దూరంగా ఉన్న శిఖరం నుండి గుడి గోపురాన్ని చూడడం ఆనవాయితీ అయిపోయింది. దానికి అంతకు మించి అర్థం ఉంటుంది, ఉంది అని యోచించడానికి కూడ మానవ మేథస్సుకు సాధ్యం కాకపోయింది, సాహసించనూ లేకపోయింది. దాని లోతుల అర్థాలు బయటపడడానికి ఈ యోగం ఆరంభం అయిన తరువాతనే అవకాశం కలిగింది అని చెప్ఫుకోవడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. పై ఉదాహరణ లాంటివి ఎన్నో కాదు, ఆధ్యాత్మిక సాహిత్య పరంగా అన్నీ ఇలాంటి అర్థాలే చెప్పబడ్డాయి.

7) పైకి ప్రత్యేకంగా చెప్పకపోయినా, ప్రతి ఒక్క వ్యక్తి లోను జన్మరాహిత్యం అనే అంశం -అంటే జన్మించిన తరువాత జన్మించి ఉండగా పుణ్య కార్యాలు చేసి, ఆ పుణ్యంతో మరణానంతరం దేముడిలో ఐక్యం అయిపోవడం- నరనరాల్లో పాతుకుపోయింది.

8) సృష్టి/ యోగ లక్ష్యంలో జన్మరాహిత్యం యొక్క పాత్ర ఏమిటి?

9) సృష్టి లక్ష్యానికి, దానికి సమాంతరమైన యోగ లక్ష్యానికి విరుద్ధంగా, తిరోగమనపు తీరుగా చెప్పబడిన జన్మరాహిత్యం అనే మాటకు సైతం ఆ లక్ష్యంలో ఎలాంటి ఏ పాత్ర లేదు. కాకపోతే, ఆధ్యాత్మిక మేథో మహానుభావుల ప్రసంగాల, ప్రవచనాల కారణంగా సామాన్య మానవుల శరీరాలలో అణువణువునా జీర్ణించుకుపోయి, ఆలోచనా/ భావనా రూపమైన కర్మ పదార్థంగా స్థూల రూప నిర్మాణంలో ఇమిడిపోయిన ప్రభావం కూకటివేళ్ళతో కదిలించబడి, కుదిలించబడి, పెకలించబడి శూన్యీకరించబడవలసిందిగా మాత్రమే జన్మరాహిత్యం అనే దానికి పాత్ర ఉంది, అంతే.
Post Reply