సమాధానం నెం.180 - ప్రశ్న నెం.180 (23-4-2022) విషయం "మరణరాహిత్యం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.180 - ప్రశ్న నెం.180 (23-4-2022) విషయం "మరణరాహిత్యం".

Post by Katakam »

1) మరణరాహిత్యం అంటే ఏమిటి?

2) మరణరాహిత్యం అంటే మరణం రహితం కావడం లేదా మరణం లేకుండా పోవడం. ఇది వినడానికే విడ్డూరంగా, నమ్మడానికి వీల్లేకుండా ఉంది కదా. అవును. యుగయుగాలుగా చెప్పుకుంటూ వస్తున్న విషయాలు విని, వాటి లోతులు తెలియకపోయినా, అవి దేహ వ్వవస్ధలో జీర్ణించుకుపోయిన దృష్ట్యా విడ్డూరంగా, నమ్మలేనిదిగా అనిపించడం సహజమే.

3) కానీ, గొప్ప వాక్యంగా వల్లె వేసుకోబడుతున్న 'మృత్యోర్మా అమృతం గమయ' అనే దాని లోని అసలు అర్థం -అంటే మృత్యువు నుండి అమృతత్వం వైపుకు మమ్ములను నడిపించవలసినది' అనే పైనుంచి అందిన సూక్తంలో అమృతత్వంలో ముందరి దశ అయిన మరణరాహిత్యం- గురించి ఒక మాదిరిగా కూడ మేథావి మహానుభావులకు సైతం తెలియకపోవడం శోచనీయం. అలాగే, ఈశావాస్య ఉపనిషత్తు లోని శ్లోక భాగాలు అయిన 'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే' (అంటే అవిద్య చేత మృత్యువును గడచి, విద్య చేత అమృతత్వమును పొందుతారు), అలాగే 'వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా అమృతం అశ్నుతే' (అంటే వినాశం చేత మృత్యువును గడచి, సంభూతి చేత అమృతత్వమును పొందుతారు) అనే వాటిలో అమృతత్వానికి ముందరి దశ అయిన మరణరాహిత్యం గురించి వ్రాసి ఉన్న విషయం లోని లోతులు లేదా అసలు అర్థాలు అందకపోవడం లేదా మేథావి మహానుభావుల చేత అర్థం చేసుకోబడలేక పోవడం కూడ శోచనీయమే.

4) రకరకాల కారణాల చేత సృష్టి లక్ష్యం గురించి పైనుంచి అందిన విషయాలు అర్థం చేసుకోబడిన మేరకు విరుద్ధ, వ్యతిరేక భావాలతో ప్రచారం చేయబడడమే లిఖితపూర్వకంగా ఉన్న విషయాల అసలు అర్థాలు, లోతులు అందకపోవడానికి, అర్థం చేసుకోబడకపోవడానికి కారణం.

5) మరణరాహిత్యం అనే మాట లోని రాహిత్యం అనే పద భాగానికి రహితం కావడం లేదా లేకుండా పోవడం అని మాత్రమే కాక, అగ్నిమయంగా హితాన్ని చేకూర్చడం అనేది అక్షర మూలాల నుండి అర్థం. అదే ఈ యోగం యొక్క అసలు పేరు అయిన భృక్త రహిత తారక రాజ యోగం అనే దాని లోని రహిత అనే పదానికి కూడ అర్థం. ఎలా అనేది ప్రస్తుత సందర్భం కాదు.

6) మానవ జీవనంలో మరణరాహిత్యం యొక్క పాత్ర ఏమిటి?

7) మరణరాహిత్యం అనే మాట దైవానుసంధానకర్తలు (ఆధ్యాత్మికత సంబంధంగా ఒకప్పటి ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు మరియు ప్రస్తుత కాలం లోని ఆధ్యాత్మిక ప్రవచనకారులు) అయిన మేథో మహానుభావులకే మింగుడు పడని విషయం, వేద సాహిత్యంలో లిఖిత పూర్వకంగా ఉన్నప్పటికీ. ఎందుకు అంటే వేద వాజ్మయ సారంగా చెప్పబడిన భగవద్గీత లోని 'జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ' (జన్మించిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మమూ తప్పదు) అనే తేలికగా అర్థమయే శ్లోక భాగం, అలాగే ఎవరో మహానుభావుడు గీతా వాక్యానికి అనుగుణంగా చెప్పిన 'పునరపి జననం, పునరపి మరణం' (మరల మరల పుట్టడం, మరల మరల చనిపోవడం). అలాంటిది, మామూలు జన సామాన్యం సంగతి చెప్పనే అక్కర్లేదు. మరణరాహిత్యం అనే మాటకు ప్రస్తుత మానవ మానసాలలో చోటే లేదు.

8) సృష్టి/ యోగ లక్ష్యంలో మరణరాహిత్యం యొక్క పాత్ర ఏమిటి?

9) సృష్టి లక్ష్యం గానీ, యోగ లక్ష్యం గానీ ఏమిటి అనేది ఇదమిత్థంగా వస్తుతః తెలియని విషయమే అయినప్పటికీ, ఈ యోగం భూమి మీదికి వచ్చిన అనంతరం యోగ సాహిత్య పరంగా బయట పడుతున్న సృష్టి రహస్యాలలో భాగంగా సృష్టి లక్ష్యాన్ని, యోగ లక్ష్యాన్ని అన్వయించుకుని మరణరాహిత్యం గురించి చెప్పుకునే అవకాశం కలిగింది. ఏమిటి అంటే అసలైన అర్థం లోని (అంటే సృష్టి మొత్తం ప్రచారం చేయబడి, నమ్మబడుతున్న 'భగవంతుడిలో/ దేముడిలో ఐక్యం అయిపోవడం' అనే సృష్టి లక్ష్య విరుద్ధ భావనకు భిన్నంగా) మోక్షమే (అంటే మనిషి లోని దివ్యత్వమే స్థూల మనిషిగా మారడం/ రూపు దిద్దుకోవడమే) విభిన్న పదజాలాలలో సృష్టి లక్ష్యం, యోగ లక్ష్యం అయి ఉంది అని. పైన చెప్పుకున్నట్లుగా, మరణరాహిత్యం అనేది సృష్టి లక్ష్యంలో నెరవేరవలసిన దానికి ఒక మాధ్యమిక దశగా ఉంది.
Post Reply