సమాధానం నెం.181 - ప్రశ్న నెం.181 (25-4-2022) విషయం "అమృతత్వం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.181 - ప్రశ్న నెం.181 (25-4-2022) విషయం "అమృతత్వం".

Post by Katakam »

1) అమృతత్వం అంటే ఏమిటి?

2) అమృతత్వం అంటే మృతత్వం - అంటే మృత తత్త్వం లేదా మరణించే తత్త్వం లేదా మరణించే నైజం/ స్వభావం- లేకుండడం. వినగానే షాకు కొట్టే విషయం ఏమిటి అంటే ఇది ఏదో అసాధ్యం, అసంభవం అయిన అంశంగా అనిపించడం. ప్రస్తుత సృష్టి పరిస్థితులలో, సాంప్రదాయం మరియు ఆధ్యాత్మికత అనే పేర్లతో వచ్చి ఉన్న సాహిత్యం యొక్క ప్రభావంతో అలా అనిపించడం కూడ సహజమే. కానీ, సృష్టి లక్ష్యం ఏమిటో ఇదమిత్థంగా తెలిసినపుడు, దాని గురించిన అపోహలు వీడిపోవడం అరంభమయే అవకాశం.

3) అమృతత్వానికి, మరణరాహిత్యానికి మధ్య తేడా ఏమిటి?

4) అమృతత్వం, మరణరాహిత్యం రెండూ కూడ స్థూల శరీరానికి సంబంధించినవే అని ముందుగా చెప్పుకోవలసిన అవసరం. సాంప్రదాయబద్ధంగా చెప్పబడిన ఆత్మకు, మనిషిలో ఏ జన్మకు ఆ జన్మకు ఒక స్థూలానికి పరిమితం అయి ఉండే ప్రాణతరంగం యొక్క మూలం అయిన ప్రాణానికి (ఇది ఈ యోగ పరమైన విషయంగా తెలియనగును) మరణం లేదు అనేది కాదనలేని వాస్తవం. ఆ ప్రాణమే వ్యక్తి లోని దివ్యత్వం, వ్యక్తి సంబంధ భగవత్తత్త్వం.

5) అమృతత్వం అంటే శాశ్వత జీవనం లేదా శాశ్వత ప్రాతిపదికన జీవించి ఉండడం. అంటే సృష్టిలో అమృతత్వం నెలకొనిన పిమ్మట, మనుషులలో, సృష్టి జీవులలో మరణించనితనం లేదా మరణించని తత్త్వం వాళ్ళ నైజం, స్వభావం అయిపోతుంది, శాశ్వతత్వం లేదా స్థూలంగా శాశ్వతంగా జీవించి ఉండడం సృష్టి నైజం, స్వభావం అవుతుంది.

6) అమృతత్వానికి భిన్నంగా మరణరాహిత్యం అంటే తపస్సు ద్వారా లేదా యోగ (ఇతర యోగ) ప్రక్రియల ద్వారా సంభవించబోయే మరణాన్ని దాటిపోవడం. అలా ఎన్ని సార్లు అయినా, ఎంత కాలం అయినా రాబోయే మరణాలను అధిగమించడం మాత్రమే అవుతుంది. కానీ, స్థూలానికి మరణించని తత్త్వం, నైజం, స్వభావం రావడం కాదు. వచ్చే మరణాన్ని అవసరపడిన ప్రతిసారీ ఎప్పటికప్పుడు దాటుకుంటూ పోవడం మాత్రమే.

7) మరణరాహిత్యం అనేది ఎంతెంతో ఆధ్యాత్మిక ఉన్నతిని, ఆ కోణంలో శక్తులు సాధించిన అతి కొద్దిమంది ఆధ్యాత్మిక మహానుభావులకు మాత్రమే సాధ్యం కావడం జరిగింది. కానీ, సృష్టి లక్ష్యానికి సమాంతరమైన యోగ లక్ష్యంగా అమృతత్వం అనేది సృష్టికి, సృష్టి మానవులకు సర్వులకూ సంబంధించింది.

8) మానవ జీవనంలో లేదా మానవ జీవితంలో అమృతత్వం యొక్క పాత్ర ఏమిటి?

9) మానవ జీవనంలో (జీవనం సాగించడానికి లేదా జీవించి ఉండడానికి మనిషి ఉద్యుక్తుడయే క్రియాకలాపాలలో) గానీ, మానవ జీవితంలో (వస్తుతః ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికతకు కాక, కేవలం దేముళ్ళకు సంబంధింపచేయబడిన ఆధ్యాత్మిక క్రియాకలాపాలలో) గానీ అమృతత్వం అనే మాటకు సైతం చోటు లేదు. కాకపోతే, పైనుంచి అందిన ఆత్మ సంబంధ ఆధ్యాత్మిక సాహిత్యంలో 'మృత్యోర్మా అమృతం గమయ', 'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే', 'వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా అమృతం అశ్నుతే' లాంటి అమృతత్వ సంబంధ ప్రస్తావనలు ఉన్నప్పటికీ, అందుకున్న మహానుభావులకు వాటి లోతుల అర్థాలు అవగాహనకు రానే లేదు. సామాన్య జనానీకం సంగతి చెప్ఫనే అక్కర్లేదు.

10) సృష్టి/ యోగ లక్ష్యంలో అమృతత్వం యొక్క పాత్ర ఏమిటి?

11) సృష్టి లక్ష్యం గానీ, యోగ లక్ష్యం గానీ ఏ పదాలతో ఏ రకంగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా అమృతత్వానికే సంబంధించి ఉన్నాయి. కాకపోతే, భృక్త రహిత తారక రాజ యోగం అనే ఈ నూతన యోగం ఆరంభం అయిన తరువాతనే అమృతత్వం అనేది సృష్టి లక్ష్యం అనీ, యోగ లక్ష్యం అనీ తెలియవస్తోంది. అంతేకాదు, యోగ పరంగా జరిగే క్రియలలో, ప్రక్రియలలో దాని ఆనవాళ్ళు అర్థమయీ కాకుండా గమనికకు అందుతున్నాయి. అమృతత్వం అనేది నెరవేరి తీరవలసిన అవసరం, నెరవేరబోయే వాస్తవం.
Post Reply