1) 2వ ముఖ్యమైన వైఫల్యం "ఇతరులకు సమాధానం చెప్పేటపుడు అవతలి వాళ్ళ పొరపాటు మాటకు చిరాకుతో కూడిన పదాలు సమాధానంగా రావడం, అదీ ప్రశాంతంగా సౌమ్యమైన శబ్దాలతో కాకుండా" అని వ్రాయబడి ఉన్న దానికి లోతుల అర్థం ఏమిటి?
2) మాస్టరు గారి వైఫల్యంగా చెప్పుకోబడిన ఇది 8 సంవత్సరాల పై చిలుకు అనవరత యోగా ప్రాక్టీసు యొక్క డెవలప్మెంటు తరువాత మాత్రమే తెలియబడిన విషయం అని ముందుగా గ్రహించనగును.
3) చదవగానే అనిపించే విషయం ఏమిటి అంటే అలా ఉండడం వైఫల్యం ఎందుకు అవుతుంది, అవతలి వాళ్ళ పొరపాటుకు అలా స్పందించడం సాధారణమే కదా, సర్వ సహజమే కదా అని. సాధారణం, సర్వ సహజం కాబట్టే, అది కేవలం వ్యక్తి సంబంధం మాత్రమే కాదు, విశ్వ విధానంగా వ్యక్తుల స్థాయిలో, వ్యక్తుల ఇష్టాలకు అతీతంగా జరిగే సృష్టి అంతటా నెలకొని ఉన్న మనిషి నైజం అని తెలియనవుతుంది.
4) ఇక్కడ గ్రహించవలసిన ఇంకొక విషయం ఏమిటి అంటే 'పొరపాటు మాట' అనే పదం. అంటే అవతలి వాళ్ళు పొరపాటు మాటలు వాడారు అని తెలియడం. పొరపాటు మాటలు వాడారు అని తెలిసిన పిమ్మట, వాటికి స్పందించే లేదా సమాధానం ఇచ్చే తీరులో చిరాకుగానూ, ప్రశాంతంగా సౌమ్యమైన శబ్దాలతో కాకుండానూ అనేది గుర్తించవలసిన, గమనించవలసిన విషయం. అంటే పొరపాటు మాటలు అని గుర్తించినంత మాత్రం చేత స్పందించే లేదా సమాధానం ఇచ్చే తీరు తన నియంత్రణలో ఉండదు అనేదే సృష్టి స్థాయిదిగా మనిషి నైజం.
5) కానీ, సామాజిక స్రవంతి పరంగా వ్యక్తుల పరస్పర సంబంధాలలో ప్రస్తుతం ఉన్న తీరుగా, అది ఒక లోపభూయిష్టమైన తీరుగా, మార్పు చోటు చేసుకోవలసిన అవసరం ఉన్న విషయంగా (ప్రత్యక్షంగా అలా అని వ్యక్తం చేయకపోయినప్పటికీ) గుర్తించబడడం, అది యథాతథంగా మాటలలో వ్యక్తం చేయబడడం అనేది యోగప్రాక్టీసు లోని యోగ క్రియలు, యోగ ప్రక్రియల ఫలితంగా మాత్రమే అని గుర్తించనగును. అదే ఇక్కడ చోటు చేసుకున్న వైనం.
6) ఇతరుల పొరపాటును, పొరపాటు మాటలను గుర్తించడం ఒక రకంగా తేలికయిన విషయమే అయినా, దానికి స్పందించే తీరులో తన లోని ఒక లోపాన్ని గుర్తించడం అనే అంశం యొక్క లోతులకు వెళ్తే తెలియదగినది ఏమిటి అంటే గుర్తించబడిన ఇతరుల పొరపాటుకు సంబంధించిన విధంగా తనలో కూడ అలాంటి తత్త్వమే ఉంది అని, అందుచేతనే గుర్తించబడిన పొరపాటుకు తన స్పందన చిరాకు తోనూ, ప్రశాంతంగా సౌమ్యమైన శబ్దాలతో కాకుండానూ ఉంది అని.
7) విషయంగా గుర్తించబడడం అనేది గుర్తించే వ్యక్తి లోతులలో ఉన్న సంబంధిత నైజంలో మార్పు తీసుకురావడానికి ఈషణ్మాత్రం దోహదం చేయలేదు. సృష్టి సమస్తంగా ఉన్న సర్వ సాధారణమైన, సర్వ సహజమైన ఈ విశ్వ విధానపు ఈ తీరు అనేది నూతన సృష్టి విధానాన్ని ఆవిష్కరించడానికి సమకట్టిన ఈ యోగం లోని ప్రాక్టీసు మాధ్యమంగా జరిగిన, జరిపించబడిన యోగ క్రియలు, ప్రక్రియల ఫలితంగా బయటపెట్టబడి, యోగ ప్రయోగాలలో భాగంగా స్థూల వ్యక్తుల ద్వారా సృష్టి స్థాయి మార్పు, విశ్వ విధానపు మార్పు మూల స్థాయిల ప్రక్రియల చేత జరిపించబడే నిమిత్తం ఒక ఆరంభ సంఘటనగా జరిగినట్లుగా తీసుకోనగును.
8) ఈ విషయంగా యోగ సాధక సమాజానికి తెలియవలసిన విషయం ఏమిటి?
9) ఇది మాస్టరు గారి వ్యక్తిగత విషయం కాదు. ఆయన స్వయంగా దీనిని ఒక వైఫల్యంగా చెప్పుకున్నప్పటికీ, అది ఆయన స్వంత వైఫల్యం కాదు. సృష్టి సమస్తం ఉండి, మార్పు చెందవలసిన అవసరం ఉన్న మనిషి లక్షణపు అంశంగా మాస్టరు గారి ద్వారా బయట పెట్టబడిన సందర్భం. అది మానవాళి సమస్తంలో సృష్టి స్థాయిదిగా, విశ్వ విధానపు తీరుగా సరిదిద్దబడవలసిన మనిషి నైజంగా బయటపెట్టబడి దిద్దుబాటుకు యోగ పరమైన ఆరంభ ప్రయోగం.
సమాధానం నెం.187 - ప్రశ్న నెం.187 (7-5-2022) విషయం "మాస్టరు గారి 'స్వయం - అనుభూతి, ముఖ్యమైన వైఫల్యాలు' - 2".
-
Katakam
- Posts: 3868
- Joined: Sun May 09, 2021 6:18 pm