సమాధానం నెం.190 - ప్రశ్న నెం.190 (13-5-2022) విషయం "మాస్టరు గారి 'స్వయం - అనుభూతి, ముఖ్యమైన వైఫల్యాలు' - 5".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3868
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.190 - ప్రశ్న నెం.190 (13-5-2022) విషయం "మాస్టరు గారి 'స్వయం - అనుభూతి, ముఖ్యమైన వైఫల్యాలు' - 5".

Post by Katakam »

1) 5వ ముఖ్యమైన వైఫల్యం "పనులను నిర్వహించే కార్యక్రమంలో దగ్గరుండి నడిపించండంలో మానసిక సామర్థ్యం సన్నగిల్లుతోంది" అని వ్రాయబడి ఉన్న దానికి లోతుల అర్థం ఏమిటి?

2) వైఫల్యంగా పేర్కొనబడిన ఈ అంశంలో గుర్తించవలసినది 'మానసిక సామర్థ్యం సన్నగిల్లడం'. అది దేనిలో అంటే 'పనులను నిర్వహించే కార్యక్రమంలో దగ్గరుండి నడిపించడంలో'. 'మానసిక సామర్థ్యం సన్నగిల్లడం' అనేది వైఫల్యమా లేదా యోగ క్రియల, ప్రక్రియల ఫలితంగా జరుగుతున్న సూక్ష్మ స్థాయి డెవలప్మెంటు సంబంధమా అనేది పరిశీలించవలసిన అవసరం.

3) ఏ కొంచెం అనుమానం, తడబాటు లేకుండా చెప్పుకోదగిన విషయం ఏమిటి ఇది వైఫల్యం కాదు అని. కానీ, ఇది వైఫల్యం కాదు అని తేలాలి అంటే ఇది యోగ క్రియల, ప్రక్రియల ఫలితంగా జరుగుతున్న సూక్ష్మ స్థాయి డెవలప్మెంటు సంబంధం అనేది స్పష్టంగా తెలియవలసిన అవసరం.

4) 'ఏకంకు చేరుకోవడానికి మనసు సంస్కరించబడడం' అనే యోగ లక్ష్యపు ఒక మితి ఇక్కడ ప్రస్తావనీయం. బుద్ధి జీవి మనిషిలో అతని బుద్ధి తన అసలు స్థాయితో పనిచేసి, బుద్ధి కేవలం ఉన్నటువంటి మనిషిగా కాక బుద్ధి పనిచేసే మనిషిగా మారడం లక్ష్యం. దానికి ఉన్న ఏకైక ఆటంకం కేవలం మనిషి మానసికమే, మానసిక తలమే. యాస్ట్రలుకు లేదా మేథస్సుకు ఆహారంగా పనిచేసే మానసిక తలం దేహ వ్యవస్థ యొక్క కార్యకలాపాలకు వెన్నుదన్నుగా ప్రస్తుతం ఉంటున్న స్థితి నుండి ఆత్మిక స్థాయిల ఆధ్వర్యంలో, ఆత్మిక తలాల సారథ్యంలో, ఆత్మిక తలాల కార్యక్రమానికి పూర్తి అనుగుణంగా బుద్ధి యొక్క నిర్ణయాన్ని అనుసరించి పనిచేయడం జరగవలసిన/ జరుగుతున్న 'మనసు సంస్కరించబడడం' అనే కార్యక్రమం.

5) కేవలం సూత్రప్రాయంగా మాత్రమే అంది, లోతులు చెప్పుకోవడానికి గానీ, అందుకు మార్గం ఇదీ అని చెప్పుకోవడానికి గానీ ఏమాత్రం వీలులేని సాంప్రదాయబద్ధ 'మన ఏవ మోక్ష బంధన కారణాత్' (మనసే మోక్షానికి, బంధానికి కారణం అయి ఉంది - దీనిలో క్రమం అయిన బంధం, మోక్షం అని కాక, మోక్షం, బంధం అని చెప్పడం లోని ప్రత్యేకతను మోక్షం కోసమే బంధం అనే సూక్ష్మ విషయంగా పరిగణించనగును) అనే దానికి విధాన పరమైన లోతులు గానీ, సూత్రప్రాయంగా ఉన్న దానిని ఆచరణ సాధ్యం చేసే మార్గం గానీ 'మనసు సంస్కరించబడడం' అనే దానిలో గుర్తించనవుతుంది. కాకపోతే, ఎవరికి వారు దీని యోగ సంబంధమైన డెవలప్మెంటును గుర్తించడానికి వృద్ధి చెందిన గమనిక స్థాయియే శరణ్యం.

6) 'మానసిక సామర్థ్యం సన్నగిల్లుతోంది' అని చెప్పుకున్నపుడు, ఎంతో సమర్థవంతంగా పనిచేసే మనసు తన సామర్థ్యాన్ని కోల్పోతుంది అనేది మాత్రమే చెప్పుకోదగిన అర్థం కాదు, అది యోగ పరంగా డెవలప్మెంటు ప్రక్రియ -అంటే వెర్రిమొర్రి ఆలోచనలలో, ఆలోచనలుగా మనసు మానసిక సంస్కరణలో భాగంగా తన పట్టును కోల్పోయి, పై స్థాయిల ఆధ్వర్యంలో పనిచేయడానికి ముందస్తు చర్యగా తన ప్రాభవాన్ని/ సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతోంది- అనే అంశాన్ని కూడ తీసుకోనగును.

7) మాస్టరు గారి డైరీలలో 21-4-1922 న "సూచన: స్వీయ దేహ వ్యవస్థ గురించి" అనే శీర్షిక క్రింద వ్రాయబడిన "ఆలోచన తీరు కరెక్టుగా వర్తిస్తుంది. ఒక భావన చేస్తే దానికి ఫలితం ఉంటుంది" అనేది 12 సంవత్సరాల అవిరళ కృషి అనంతరం యోగ క్రియల, ప్రక్రియల, ప్రయోగాల ఫలితంగా మాస్టరు గారికి ఒనగూడిన స్థూల స్థాయి వ్యక్తిగత ప్రయోజనం అని, అది 'మనసు సంస్కరించబడడం' అనే యోగ లక్ష్యపు
ఒక మితిలో భాగం అని తెలియనగును.

8) ఈ విషయంగా యోగ సాధక సమాజానికి తెలియవలసిన విషయం ఏమిటి?

9) ఒకటి, ఇది మాస్టరు గారికి సంబంధించిన వైఫల్యం కాదు. రెండు, యోగాన్ని యోగంగా లేదా యోగా ప్రాక్టీసును యోగా ప్రాక్టీసుగా (అంటే వాడుకోబడకూడని యోగా ప్రాక్టీసుగా, ఫిజికల్ అసిస్టుమెంటుకు సంబంధించనిదిగా) చేయగలిగినపుడు మాత్రమే, మానసిక సంబంధమైన మార్పులు యోగా డెవలప్మెటుకు సంబంధించినవిగా డెవలప్ అయిన గమనికకు మాత్రమే అందనవుతాయి.
Post Reply